`బిల్లుపై ఎప్పుడు చర్చ చేపట్టాలనేది నిర్ణయిస్తాం` | will decide to discuss on Telangana draft bill, says Sridhar Babu | Sakshi
Sakshi News home page

`బిల్లుపై ఎప్పుడు చర్చ చేపట్టాలనేది నిర్ణయిస్తాం`

Dec 12 2013 9:05 PM | Updated on Sep 27 2018 5:56 PM

`బిల్లుపై ఎప్పుడు చర్చ చేపట్టాలనేది నిర్ణయిస్తాం` - Sakshi

`బిల్లుపై ఎప్పుడు చర్చ చేపట్టాలనేది నిర్ణయిస్తాం`

రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరిందంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

హైదరాబాద్: రాష్ట్ర విభజన ముసాయిదా బిల్లు రాష్ట్రానికి చేరిందంటూ శాసనసభ వ్యవహారాల మంత్రి పేర్కొన్నారు. అయితే అసెంబ్లీలో మొదటి ప్రాధాన్యత బిల్లుపై చర్చకు ఉంటుందని ఆయన అన్నారు. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లతో మాట్లాడి... బిల్లుపై ఎప్పుడు చర్చ చేపట్టాలనేది నిర్ణయిస్తామని శ్రీధర్ బాబు పేర్కొన్నారు.

కాగా, కేంద్ర హోం మంత్రిత్వ సంయుక్త కార్యదర్శి సురేష్ కుమార్ తీసుకొచ్చిన 5 బండిళ్లలో ఉన్న ముసాయిదా బిల్లు ప్రతులను సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మొహంతికి అందజేసిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement