ఎవరీ సుందర్ పిచాయ్..? | who is sundat pichai..? | Sakshi
Sakshi News home page

ఎవరీ సుందర్ పిచాయ్..?

Aug 11 2015 12:43 PM | Updated on Sep 3 2017 7:14 AM

ఎవరీ సుందర్ పిచాయ్..?

ఎవరీ సుందర్ పిచాయ్..?

అంతర్జాతీయ స్థాయి ఐటీ రంగంలో మరో భారత సంతతి వ్యక్తి అత్యున్నత పదవి అలంకరించారు.

చెన్నై: అంతర్జాతీయ స్థాయి ఐటీ రంగంలో మరో భారత సంతతి వ్యక్తి అత్యున్నత పదవి అలంకరించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో గా తెలుగు వ్యక్తి సత్యా నాదెళ్ల బాధ్యతలు చేపట్టగా.. తాజాగా పొరుగు రాష్ట్రం తమిళనాడుకు చెందిన సుందర్ పిచాయ్ (43) ఇంటర్నెట్ దిగ్గజం గూగుల్ సీఈవోగా నియమితులయ్యారు.

తమిళనాడు రాజధాని చెన్నైలో సుందర్ 1972లో జన్మించారు. ఆయన ఐఐటీ- ఖరగ్పూర్ నుంచి ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ సంపాదించారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్, వార్టన్ స్కూల్ ఆఫ్ పెన్సిల్వేనియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పట్టాను సుందర్ పొందారు. పిచాయ్ 2004 లో గూగుల్ లో చేరి అంచెలంచెలుగా ఎదిగి సీఈఓ స్థాయికి చేరారు. ఇంటర్నెట్ సెర్చింజన్‌గా సేవలను ప్రారంభించిన గూగుల్, ఆపై డ్రోన్ల తయారీ, ఫార్మా, వెంచర్ కాపిటల్ ఇలా పలు రంగాలకు విస్తరించింది. తాజాగా కొత్త ప్రొడక్టులను కనుగొని వాటిని అభివృద్ధి చేయడానికి గూగుల్ అల్ఫాబేట్ పేరిట కొత్త సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి గూగుల్ అనుబంధ సంస్థగా కొనసాగనుంది.

Advertisement
 
Advertisement
Advertisement