ఇబోలాతో.. అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి | WHO declares Ebola outbreak International Health Emergency | Sakshi
Sakshi News home page

ఇబోలాతో.. అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి

Aug 8 2014 2:08 PM | Updated on Sep 2 2017 11:35 AM

ఇబోలాతో.. అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి

ఇబోలాతో.. అంతర్జాతీయ అత్యవసర పరిస్థితి

పశ్చిమాఫ్రికాలో మొదలై ప్రపంచ వాసులందరినీ గడగడలాడిస్తున్న ఇబోలా వైరస్ వ్యాప్తిని ప్రపంచవ్యాప్త అంతర్జాతీయ పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది.

పశ్చిమాఫ్రికాలో మొదలై ప్రపంచ వాసులందరినీ గడగడలాడిస్తున్న ఇబోలా వైరస్ వ్యాప్తిని ప్రపంచవ్యాప్త అంతర్జాతీయ పరిస్థితిగా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అన్ని దేశాలూ సమన్వయంతో కృషిచేసి ఇబోలా వైరస్ మరిన్ని ప్రాంతాలకు విస్తరించకుండా నియంత్రించాలని డబ్ల్యుహెచ్ఓ ఓ ప్రకటనలో తెలిపింది.

'పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆఫ్ ఇంటర్నేషనల్ కన్సర్న్' ప్రకటించాలని కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించిందని వివరించింది. గినియా, లైబీరియా, నైజీరియా, సియెర్రా లియోన్ దేశాల్లో ఇప్పటివరకు 1711 మందికి ఈ వైరస్ వ్యాపించిందని, 932 మంది మరణించారని డబ్ల్యుహెచ్ఓ అంచనా వేస్తోంది. వాస్తవ సంఖ్య ఇంతకంటే కూడా ఇంకా ఎక్కువగానే ఉండే ప్రమాదం లేకపోలేదు.

Advertisement
 
Advertisement
Advertisement