జపనీస్‌ చెట్టు వేర్ల నూనెతో సుఖనిద్ర! | Soothing with Japanese knotweed oil | Sakshi
Sakshi News home page

జపనీస్‌ చెట్టు వేర్ల నూనెతో సుఖనిద్ర!

Oct 18 2026 3:47 AM | Updated on Oct 18 2026 3:47 AM

Soothing with Japanese knotweed oil

నిద్రలేమి సమస్య ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ల వాడకం పెరిగాక ఈ సమస్య మరింత పెరిగింది. అందునా మధ్యవయసు వారిలో.. 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసులోని మహిళల్లో నిద్రలేమి ఎక్కువగా ఉంటోంది. ఓ స్వాభావిక మార్గం ద్వారా ఈ సమస్యను ఎదుర్కోవచ్చంటున్నారు జపాన్‌ పరిశోధకులు. ఇందుకు వారు తాజా అధ్యయ­నాన్ని ఉదాహరణగా చూపుతున్నారు. జపాన్‌లోని క్యుషు యూని­వర్సిటీ పరిశోధకులు హినోకీ అనే పేరున్న చెట్టు (దీని సైంటిఫిక్‌ పేరు కేమియేసైపారిస అబ్‌ట్యూజా) వేర్ల నుంచి తీసిన సువాసన నూనె (ఆరోమాటిక్‌ ఆయిల్‌)పై పరిశోధనలు చేశారు. 

ఈ నూనె నిద్రలేమి బాధితుల్లో సుఖనిద్రకు తోడ్పడే అవకాశం ఉందని గుర్తించారు. జపనీస్‌ సైప్రస్‌గానూ పిలిచే ఈ చెట్టు నూనె తాలూకు సువాసన పీల్చాక తేలికగా నిద్రలోకి జారుకోవడానికి తోడ్పడినట్లు పరిశోధనల్లో తేలిందంటున్నారు. నిద్ర పట్టడంలో ఇబ్బంది పడేవారు లేదా నిద్రలోకి జారుకున్నా పదేపదే మెలకువ వచ్చే వారు ఈ నూనె సువాసనను పీల్చడం వల్ల తేలికగా నిద్రపడుతుందనేది పరిశోధకుల మాట.  

పిల్లల్లో ఊబకాయంపై డబ్ల్యూహెచ్‌ఓ మార్గదర్శకాలు 
ల్లలు, కౌమార దశలోని బాలల్లో ఊబకాయం వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహె­చ్‌ఓ) తొలిసారిగా దీనిపై మార్గదర్శకాలను విడుదల చేసింది. డబ్ల్యూ­హెచ్‌ఓ లెక్కల ప్రకారం 2024 నాటికి ప్రపంచవ్యాప్తంగా 5–19 ఏళ్ల వయసున్న పిల్లలు, టీనేజర్లలో 17 కోట్ల మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. 1990లో 2 శాతంగా ఉన్న ఊబకాయం వ్యాధి 2024 నాటికి 8 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో ఊబకాయం ఉన్న పిల్లలు, టీనేజర్లకు క్రమబద్ధమైన ఆహార ప్రణాళిక, వ్యాయా­మం, ఆరో­గ్య­కరమైన అలవాట్లు పెంపొందించే కార్యక్రమాలు అందించాలని డబ్ల్యూహెచ్‌ఓ సూచించింది. 

9 ఏళ్లలోపు పిల్లలకు బరువు తగ్గించే మందులు, శస్త్రచికిత్సలను డబ్ల్యూహెచ్‌ఓ సిఫార్సు చేయలేదు. 10–19 ఏళ్ల టీనేజర్లలో జీవనశైలి మార్పులతో కూడిన కార్యక్రమాలు ఆశించిన ఫలితాలనివ్వనప్పుడే కొన్ని మందులను పరిశీలించాలని సూచించింది. తీవ్రమైన ఊబకా­యం ఉన్నవారికి నిర్దిష్ట నిబంధనల ప్రకారమే శస్త్రచికి­త్సలను పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొంది. ఊబకా­య చికిత్సతోపాటు చిన్నారులకు పోషకాహారం అందుబాటులో ఉండేలా చూడటం, వ్యాయామానికి అనువైన వాతావరణం కల్పించేలా చర్యలు తీసుకోవడం కీలకమని తెలిపింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement