ప్రభుత్వ ఆధారిత మ్యాప్‌ల వెబ్‌సైట్‌ ప్రారంభం | Website launched for Survey of India map download, but Aadhaar is mandatory | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆధారిత మ్యాప్‌ల వెబ్‌సైట్‌ ప్రారంభం

Apr 11 2017 9:29 AM | Updated on Sep 5 2017 8:32 AM

సుమారు 3000 మ్యాప్‌లను ప్రజలకు అందుబాటులో ఉంచేందుకుగాను కేంద్రం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది.

న్యూఢిల్లీ: సర్వే జనరల్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌జీఐ) రూపొందించిన సుమారు 3000 మ్యాప్‌లను భారత ప్రజలకు అందుబాటులో ఉంచేందుకుగాను కేంద్ర ప్రభుత్వం సోమవారం ఓ వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. అయితే ఈ http://soinakshe.uk.gov.in వెబ్‌సైట్‌ నుంచి మ్యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఆధార్‌ నంబర్‌ ఇవ్వాల్సి ఉంటుందని తెలిపింది. ఒక వ్యక్తి తన ఆధార్‌ నంబర్‌ను ఉపయోగించి రోజుకు 3 మ్యాప్‌లను మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం ఉందని పేర్కొంది.

కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి హర్షవర్థన్‌ మాట్లాడుతూ.. ఈ మ్యాప్‌లను భారతీయులకు మాత్రమే అందుబాటులోఉంచాలన్న ఉద్దేశంతోనే ఆధార్‌ నంబర్‌ తప్పనిసరి చేశామని తెలిపారు. ఎస్‌జీఐ ఆవిర్భవించి సోమవారంతో 250 ఏళ్లు పూర్తి చేసుకుంది. దేశానికి సంబంధించిన మ్యాప్‌లను అధికారికంగా ఎస్‌జీఐ మాత్రమే తయారు చేస్తుంది.

Advertisement
 
Advertisement
Advertisement