'తప్పు రేవంత్దో.. ఆయన పార్టీదో తేలాలి' | we are not supporting revanth, says kishan reddy | Sakshi
Sakshi News home page

'తప్పు రేవంత్దో.. ఆయన పార్టీదో తేలాలి'

Jun 2 2015 4:52 PM | Updated on Aug 29 2018 6:26 PM

'తప్పు రేవంత్దో.. ఆయన పార్టీదో తేలాలి' - Sakshi

'తప్పు రేవంత్దో.. ఆయన పార్టీదో తేలాలి'

రేవంత్ రెడ్డి తప్పు చేశారా.. లేదా ఆయన పార్టీ తప్పు చేసిందా అనే విషయం ఇంకా తేలాల్సి ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

రేవంత్ రెడ్డి తప్పు చేశారా.. లేదా ఆయన పార్టీ తప్పు చేసిందా అనే విషయం ఇంకా తేలాల్సి ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తాము రేవంత్ను సమర్థించడం లేదని, ఈ విషయాన్ని తమ జాతీయ నాయకుల వద్దకు తీసుకెళ్తామని చెప్పారు. టీడీపీతో పొత్తు విషయంలో భవిష్యత్తు గురించి తమ జాతీయ నాయకత్వమే నిర్ణయం తీసుకుంటుందని కిషన్ రెడ్డి తెలిపారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తొలి ప్రాధాన్యత ఓటు తెలుగుదేశం పార్టీకే వేశామని, అయితే రెండో ప్రాధాన్యత మాత్రం నోటాకు వేశామని కిషన్ రెడ్డి చెప్పారు. నోటాకు ఓటు వేస్తే చెల్లదన్న విషయం తమకు తెలియదని ఆయన అన్నారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 ఓట్లు నోటాకు పడిన విషయం తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement