కోల్ కతా, అసాన్సోల్ ల మధ్య నడిచే ఓల్వో బస్సు లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన హ్లగ్లీకి సమీపంలోని డాకుని సమీపంలో చోటుచేసుకుంది
ఓల్వో బస్సులో మంటలు
Jan 24 2014 6:53 PM | Updated on Sep 5 2018 9:45 PM
హుగ్లీ: కోల్ కతా, అసాన్సోల్ ల మధ్య నడిచే ఓల్వో బస్సు లో మంటలు చెలరేగాయి. ఈ ఘటన హ్లగ్లీకి సమీపంలోని డాకుని సమీపంలో చోటుచేసుకుంది. డ్రైవర్ అప్రమత్తతో పెద్ద ప్రమాదమే తప్పింది. పోలీసుల సహకారంతో అసాన్సోల్ వద్ద ప్రయాణికులు సురక్షితం బయటపడ్డారు.
సమాచారం అందించడంతో అగ్నిమాపక యంత్రాలు ప్రమాదస్థలికి చేరుకున్నాయి. అయితే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకోవడానికి ముందే బస్సు పూర్తిగా దగ్ధమైందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదానికి కారణం షాట్ సర్యూట్ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
గత సంవత్సరం జరిగిన వేర్వేరు ఓల్వో ప్రమాద ఘటనల్లో కర్నాటకలో 52 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 30 తేదిన బెంగళూరు,హైదరాబాద్ ల మధ్య నడిచే ఓల్వో బస్సు మహబూబ్ నగర్ జిల్లాలోని పాలెం వద్ద జరిగిన ప్రమాదంలో 30 మరణించగా, నవంబర్ 14 తేదిన హవేరి వద్ద జరిగిన మరో ప్రమాదంలో ఏడుగురు మృత్యువాత పడ్డారు.
Advertisement
Advertisement