పదిరోజుల తర్వాత తెరుచుకున్న 'విబ్జియర్' | Vibgyor school reopened after a gap of ten days | Sakshi
Sakshi News home page

పదిరోజుల తర్వాత తెరుచుకున్న 'విబ్జియర్'

Jul 29 2014 3:08 PM | Updated on Sep 2 2017 11:04 AM

పదిరోజుల తర్వాత తెరుచుకున్న 'విబ్జియర్'

పదిరోజుల తర్వాత తెరుచుకున్న 'విబ్జియర్'

ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మరో ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు.

బెంగళూరు: ఆరేళ్ల బాలికపై అత్యాచారం కేసులో మరో ఇద్దరిని బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు జిమ్ ఇన్స్ట్రకర్లను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు మంళవారం వెల్లడించారు. ఇదే కేసులో ఇంతకుముందు స్కేటింగ్ శిక్షకుడిని అరెస్ట్ చేశారు. ఇతడు ఇచ్చిన సమాచారం ఆధారంగా మిగతా ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు పోలీసు కమిషనర్ తెలిపారు. నిందితుడు నేరం అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి.

విబ్జియర్ పాఠశాలతో ఒకటవ తరగతి చదువుతున్న విద్యార్థిని జులై 2న అత్యాచార ఘటన జరిగినప్పటికీ స్కూలు యాజమాన్యం ఆ విషయం బయటికి పొక్కకుండా దాచిపెట్టింది. ఈనెల 9వ తేదీన బాలిక తల్లిదండ్రులు స్కూలు యాజమాన్యానికి ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగు చూసింది. 14న పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా పదిరోజుల విరామం తర్వాత విబ్జియర్ స్కూల్ మళ్లీ సోమవారం(జూలై 28న) తెరుచుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement