10 మంది కుటుంబసభ్యులను చంపేశాడు.. | Uttar Pradesh: 11 family members found dead at home in Amethi | Sakshi
Sakshi News home page

10 మంది కుటుంబసభ్యులను చంపేశాడు..

Jan 4 2017 11:45 AM | Updated on Sep 5 2017 12:24 AM

10 మంది కుటుంబసభ్యులను చంపేశాడు..

10 మంది కుటుంబసభ్యులను చంపేశాడు..

చెల్లా చెదురుగా పడిఉన్న మృతదేహాలు, అందులో ఆరుగురు చిన్నపిల్లలు.. ఊహించడానికే భయం గొలిపే దృశ్యాలను చూసి చుట్టుపక్కలవాళ్లు షాక్‌కు గురయ్యారు.

- అనంతరం ఆత్మహత్య చేసుకున్న నిందితుడు
- మృతుల్లో ఆరుగురు చిన్నపిల్లలు.. యూపీలోని అమేథీలో ఘోరం


అమేథీ
: తెల్లారేసరికి ఆ ఇల్లు శవాల గుట్టలా మారింది. చెల్లా చెదురుగా పడిఉన్న మృతదేహాలు, అందులో ఆరుగురు చిన్నపిల్లలు.. ఊహించడానికే భయం గొలిపే దృశ్యాలను చూసి చుట్టుపక్కలవాళ్లు షాక్‌కు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని అమేథీ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని సుల్తాన్‌పూర్‌ జిల్లా సుకుల్‌బాజార్‌ గ్రామంలో బుధవారం ఉదయం వెలుగుచూసిన ఈ ఘోరంపై పోలీసులు కేసు నమోదుచేసుకున్నారు. ప్రాథమిక సమాచారాన్ని బట్టి..


స్థానికంగా బ్యాటరీల షాపులో పనిచేసే జమాలుద్దీన్‌ అనే వ్యక్తి తన కుటుంబానికే చెందిన 10 మందిని దారుణంగా హతమార్చి, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అందరూ నిద్రిస్తున్న సమయంలో ఇంటికి వచ్చిన జమాలుద్దీన్‌.. కత్తితో భార్యా, పిల్లలు, బంధువులపై దాడిచేశాడు. చప్పుడు కాకుండా ఒకరితర్వాత మరొకరిని చంపి, చివరికి ఇంట్లోనే ఉరి వేసుకుని ప్రాణాలు విడిచాడు. తెల్లవారిన తర్వాతగానీ చుట్టుపక్కలవారు ఈ ఘోరాన్ని గుర్తించారు.

ఒక్కరు మాత్రమే ప్రాణాలతో..
జమాలుద్దీన్‌ ఇంట్లో జరిగిన ఘోరానికి సజీవసాక్షి అతని భార్య. గొంతు తెగిపోయి కొనప్రాణాలతొ కొట్టుమిట్టాడుతోన్న ఆమెను పోలీసులు గుర్తించి, హుటాహుటిన సుల్తాన్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని పోలీసులు చెప్పారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement