సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లతో కలత | Upset with postings in social media..young man suicide | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లతో కలత

Mar 30 2017 3:18 AM | Updated on Nov 6 2018 7:53 PM

ప్రియురాలి ఆత్మహత్యకు కారణం నువ్వేనంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు చూసి ఓ యువకుడు సౌదీలో ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు.

గల్ఫ్‌లో జగిత్యాల జిల్లా యువకుడి ఆత్మహత్య

మేడిపెల్లి (వేములవాడ: ప్రియురాలి ఆత్మహత్యకు కారణం నువ్వేనంటూ సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌లు చూసి ఓ యువకుడు సౌదీలో ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం పోరు మల్లకి చెందిన కుంట రాజశేఖర్‌(25) మంగళ వారం సౌదీ అరేబియాలో ఉరేసుకున్నట్లు గ్రామస్తులు చెప్పారు. రాజశేఖర్‌ ఆరు నెలల క్రితం ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లాడు. 

సౌదీ  వెళ్లడానికి ముందు ఇదే మండలంలోని కట్లకుంటకు చెందిన ఓ యువతిని ప్రేమించినట్లు తెలుస్తోంది. అయితే, ప్రియురాలు ఈనెల 25న ఆత్మహత్య చేసుకుంది. ఆ అమ్మాయి చావుకు కారణం రాజశేఖరే అని, అతడ్ని కఠినంగా శిక్షించాలంటూ  ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో కొందరు పోస్టింగ్‌లు చేసినట్లు సమాచారం. దీంతో కలత చెందిన రాజశేఖర్‌ ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబసభ్యులకు సమాచారం అందింది. కొడుకు చావుకు కారణమైన  వారిని కఠినంగా శిక్షించాలని రాజశేఖర్‌ తల్లిదండ్రులు రాజన్న, రాధ కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement