'భూతానికి' జరిమానా విధించిన కోర్టు! | UK man fined for pretending to be a ghost at cemetery! | Sakshi
Sakshi News home page

'భూతానికి' జరిమానా విధించిన కోర్టు!

Aug 8 2014 7:59 PM | Updated on Oct 2 2018 4:26 PM

జనాన్ని భయపెట్టిన ఒక దొంగ 'భూతానికి' కోర్టు జరిమానా విధించింది.

లండన్:జనాన్ని భయపెట్టిన ఒక దొంగ 'భూతానికి' కోర్టు జరిమానా విధించింది. బ్రిటన్ కు చెందిన ఆంటోనీ స్టాలార్డ్ ఈ ఏడాది ఒక శ్మశానంలో భూతం మాదిరిగా జనాన్ని భయపెట్టడంతో కోర్టు అతనికి భారీ జరిమానా విధిస్తూ తీర్పు నిచ్చింది. అతను మిత్రునితో కలిసి ఫుట్ బాల్ ఆడుతున్న క్రమంలో ప్రక్కనున్న పోర్ట్స్ మౌత్ లోని కింగ్ స్టన్ శ్మశాన వాటికకు కొంతమంది జనం తమ మిత్రుల గోరీలకు నివాళలు అర్పించేందుకు వచ్చారు. ఇక స్టాలార్డ్ వారిని భయపెట్టాలని నిశ్చయించుకుని వెనక్కు నడుస్తూ దెయ్యం చేసి శబ్ధాలను కూడా జోడించాడు. దీంతో ఉలిక్కిపడ్డ వారు అక్కడ నుంచి జారుకున్నఅనంతరం పోలీస్ ఫిర్యాదు చేశారు. దీంతో స్టాలార్డ్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై పలు సెక్షన్లు నమోదు చేశారు.

 

ఇటీవలే ఈ కేసును విచారించిన కోర్టు అతనికి 75 పౌండ్లు జరిమానా విధించింది. ఇందులో 20 పౌండ్లను బాధితులకు, మరో 20 పౌండ్లను కోర్టు ఖర్చులకు చెల్లించాల్సిందిగా ఆదేశించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement