'ఉబర్'కు రూ. 46 కోట్ల జరిమానా | Uber cabs fined $7.3 million in California | Sakshi
Sakshi News home page

'ఉబర్'కు రూ. 46 కోట్ల జరిమానా

Jul 16 2015 10:18 AM | Updated on Oct 2 2018 4:34 PM

'ఉబర్'కు రూ. 46 కోట్ల జరిమానా - Sakshi

'ఉబర్'కు రూ. 46 కోట్ల జరిమానా

ఉబర్ క్యాబ్ సర్వీసెస్ కు కాలిఫోర్నియా ప్రభుత్వం సుమారు రూ. 46 కోట్ల జరిమానా విధించింది.

లాస్ ఏంజెలెస్: ట్యాక్సీ సేవలు అందిస్తున్న 'ఉబర్'కు అమెరికా భారీ జరిమానా పడింది. ఉబర్ క్యాబ్ సర్వీసెస్ కు కాలిఫోర్నియా ప్రభుత్వం సుమారు రూ. 46 కోట్ల జరిమానా విధించింది. తమ సేవలు, కార్యకలాపాలకు సంబంధించిన  సమాచారం అందించనందుకు కాలిఫోర్నియా పబ్లిక్ యుటిలీస్ కమిషన్(సీపీయూసీ)  చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ లా జడ్జి కరెన్ వి. క్లంప్టన్ జరిమానా వేశారు.

2013లో కాలిఫోర్నియాలో అమల్లోకి వచ్చిన చట్టం ప్రకారం ఇటువంటి కంపెనీలు తమ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి సమర్పించాల్సివుంది. అయితే నెలల తరబడి కోరుతున్నా ఉబర్ సమాచారం ఇవ్వకపోవడంతో ప్రభుత్వం భారీ జరిమానా విధించింది. రైడ్ లాగింగ్, డేట్, టైమ్, జిప్ కోడ్, చార్జీలకు సంబంధించిన సమాచారం ప్రభుత్వానికి సమర్పించాల్సివుంది. శాన్ ఫ్రాన్సిస్కో కేంద్రంగా పనిచేస్తున్న ఉబర్ యాప్ ఆధారంగా ట్యాక్సీ సేవలు అందిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement