టూ వీలర్లకు మినహాయింపు! | Two wheelers to be exempted in odd-even formula | Sakshi
Sakshi News home page

టూ వీలర్లకు మినహాయింపు!

Dec 23 2015 1:51 PM | Updated on Sep 3 2017 2:27 PM

దేశ రాజధానిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనున్న సరి-బేసి సంఖ్యల పథకం నుంచి ద్విచక్ర వాహనాలను మినహాయించే అవకాశముందని తెలుస్తోంది.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఢిల్లీ ప్రభుత్వం అమలు చేయనున్న సరి-బేసి సంఖ్యల పథకం నుంచి ద్విచక్ర వాహనాలను మినహాయించే అవకాశముందని తెలుస్తోంది. మహిళలు ఉపయోగించే కార్లకు కూడా మినహాయింపు ఇచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి.

దేశ రాజధానిలో పెరిగిపోయిన వాయు కాలుష్య నివారణ కోసం సరి సంఖ్య గల కార్లను ఒకరోజు, బేసి సంఖ్య గల కార్లను మరొక రోజు రోడ్లపైకి అనుమతించే ఈ పథకాన్ని జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్టు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది. దీంతో ఈ పథకంలోని మినహాయింపుల గురించి హస్తిన వాసులు చర్చించుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement