మైనర్ అక్కా చెల్లెళ్లపై సామూహిక అత్యాచారం! | Two minor sisters allegedly gang-raped in Gurgaon | Sakshi
Sakshi News home page

మైనర్ అక్కా చెల్లెళ్లపై సామూహిక అత్యాచారం!

Aug 11 2014 1:12 PM | Updated on Sep 2 2017 11:43 AM

మైనర్ అక్కా చెల్లెళ్లపై సామూహిక అత్యాచారం!

మైనర్ అక్కా చెల్లెళ్లపై సామూహిక అత్యాచారం!

మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు మైనర్ అక్కా చెల్లెళ్లపై వాళ్ల ఇంటి యజమాని, మరో ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు.

మధ్యప్రదేశ్కు చెందిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై వాళ్ల ఇంటి యజమాని, మరో ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం గుర్గావ్లోని బినోలా గ్రామంలో జరిగింది. 13, 16 సంవత్సరాల వయసున్న ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు నెల రోజుల క్రితమే మధ్యప్రదేశ్ నుంచి తమ తల్లి, సోదరుడితో కలిసి పని వెతుక్కోడానికి గుర్గావ్ ప్రాంతానికి వచ్చారు. వాళ్లు బినోలా గ్రామంలో రామావతార్ (50) అనే వ్యక్తికి చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నారు.

శనివారం రాత్రి నలుగురు నిందితులు పూటుగా మద్యం తాగి, వాళ్ల ఇంటికి వచ్చారు. ముందుగా తల్లి, సోదరుడిపై దాడిచేసి, వాళ్లను కొట్టి ఓ గదిలో పెట్టి బంధించారు. తర్వాత ఆడపిల్లలిద్దరినీ గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ ఒకరి తర్వాత ఒకరుగా పదే పదే అత్యాచారం చేశారు. తాము ఆ ఇంటికి వచ్చినప్పటినుంచే తన కూతుళ్లపై ఇంటి యజమాని కళ్లు పడ్డాయని బాధితుల తల్లి వాపోయింది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. బాధితులకు వైద్యపరీక్షలు జరిపేందుకు ప్రత్యేకంగా వైద్యుల బృందాన్ని ఏర్పాటుచేశారు. నిందితులు రామావతార్, రామ్ కిషన్ (30), మంతోష్, ఓంబీర్ (22)లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఇల్లు ఖాళీ చేయమని చెప్పినందుకే తమపై ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిందితులు విచారణలో చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement