ఇంటి ఓనర్‌తో భర్త ఒప్పందం చేసుకుని భార్యను..! | Gujarat Man arrested for allegedly striking a deal with his landlord | Sakshi
Sakshi News home page

ఇంటి ఓనర్‌తో భర్త ఒప్పందం చేసుకుని భార్యను..!

May 16 2026 6:09 PM | Updated on May 16 2026 6:40 PM

Gujarat Man arrested for allegedly striking a deal with his landlord

వేరే ప్రాంతానికి వలస వెళ్లి అక్కడ ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితి వస్తే  మళ్లీ పాత ప్రాంతానికి వెళ్లిపోతాం. కానీ ఇక్కడో పెద్ద మనిషి  ఇంటి అద్దె చెల్లించలేక పూర్తిగా నైతికతేనే వదిలేశాడు. తాను ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితుల్లో భార్యను, కూతుర్ని ఇంటి యజమానికి  శారీరక అవసరం కోసం పంపి అత్యంత దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటన గుజరాత్‌ రాష్ట్రంలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకి వెళితే..  గుజరాత్‌ రాష్ట్రానికి చెందిన ఓ వ్యక్తి కుటుంబంతో కలిసి అక్కడ మోర్బీ ప్రాంతానికి  వచ్చాడు. అక్కడ ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. ఇంటి అద్దె రూ. 2 వేలు కాగా, దాన్ని చెల్లించడానికి అష్టకష్టాలు పడుతున్నాడు. తీవ్రమైన ఆర్థిక ఇబ్బందుల ఫలితంగా నాలుగు నెలలుగా అద్దె బకాయిలు పేరుకుపోయాయి. 

దీన్ని ఇంటి యజమాని అవకాశంగా తీసుకున్నాడు.  భార్య, కూతుర్ని అప్పచెప్పే ఒప్పందానికి సదరు వ్యక్తి అంగీకరించాడు.  తద్వారా  అతని భార్య, కూతురిపై పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు ఇంటి యజమాని. ఈ విషయం ఇంటి యజమానితో ఒప్పందం చేసుకున్న వ్యక్తి అత్తకు తెలియడంతో మోర్బి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇంటి యజమానిని,  ఈ దారుణానికి పూర్తి బాధ్యడైన సదరు వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. దీని తరువాత పిల్లలపై లైంగిక నేరాల నుండి రక్షణ కల్పించే చట్టం (పోక్సో)తో సహా పలు కఠినమైన కేసులు నమోదు చేశారు.

మైనర్ బాలిక తండ్రి, ఇంటి యజమాని కలిసి ఈ వేధింపులకు పాల్పడినట్లు మోర్బీ  డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జే ఎం లాల్ తెలిపారు. ఈ నేరంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మూడో వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement