నెల రోజులు 24 రైళ్లు బంద్‌ | Two dozen trains in UP cancelled for a month | Sakshi
Sakshi News home page

నెల రోజులు 24 రైళ్లు బంద్‌

Nov 11 2016 8:10 PM | Updated on Aug 25 2018 6:06 PM

నెల రోజులు 24 రైళ్లు బంద్‌ - Sakshi

నెల రోజులు 24 రైళ్లు బంద్‌

ఉత్తరప్రదేశ్‌ గుండా వెళ్లే 24కు పైగా రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేశారు.

లక్నో: ఉత్తరప్రదేశ్‌ గుండా వెళ్లే 24కు పైగా రైళ్లను నెల రోజుల పాటు రద్దు చేశారు. యూపీలో ఉన్నావో నుంచి కాన్పూర్‌ను కలిపే రైల్వే బ్రిడ్జికి మరమ్మత్తులు చేస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాన్పూర్‌-లక్నో రైలు సెక్షన్‌ మధ్య నడిచే రైళ్లపై కూడా దీని ప్రభావం పడనుంది.

లక్నో-న్యూఢిల్లీ గోమ్ని ఎక్స్‌ప్రెస్‌ను శుక్రవారం నుంచి 27 రోజుల పాటు రద్దు చేశారు. గోరఖ్‌పూర్‌-యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై-లక్నో ఎక్స్‌ప్రెస్‌, ఆగ్రా ఇంటర్‌సిటీ తదితర ముఖ్యమైన రైళ్లు డిసెంబర్‌ మొదటి వారం వరకు నడవవని రైల్వే అధికారులు చెప్పారు. మరి కొన్ని రైళ్లను దారి మళ్లించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement