అల్లుడి తీరుపై ట్రంప్ అప్‌సెట్ అయ్యారట! | trump upset with son-in-laws vacation | Sakshi
Sakshi News home page

అల్లుడి తీరుపై ట్రంప్ అప్‌సెట్ అయ్యారట!

Mar 25 2017 6:42 PM | Updated on Aug 25 2018 7:52 PM

అల్లుడి తీరుపై ట్రంప్ అప్‌సెట్ అయ్యారట! - Sakshi

అల్లుడి తీరుపై ట్రంప్ అప్‌సెట్ అయ్యారట!

ఒబామా కేర్ వైద్య పాలసీపై చర్చ జరుగుతున్న కీలక సమయంలో కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్ కుష్నెర్ విహారయాత్రకు వెళ్లడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అప్‌సెట్ అయ్యారట.

వాషింగ్టన్‌: ఒబామా కేర్ వైద్య పాలసీపై చర్చ జరుగుతున్న కీలక సమయంలో కుమార్తె ఇవాంకా, అల్లుడు జారెద్ కుష్నెర్ విహారయాత్రకు వెళ్లడంతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అప్‌సెట్ అయ్యారట. ట్రంప్‌కు సన్నిహితంగా ఉండే ఓ వ్యక్తి ఈ విషయం చెప్పారు.

ఒబామాకేర్‌ వైద్య పాలసీ స్థానంలో కొత్త పాలసీని ప్రవేశపెట్టేందుకు ట్రంప్‌ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. కాగా బిల్లు ఆమోదానికి తగినంత మంది సభ్యుల మద్దతు కూడగట్టడంలో ట్రంప్ సర్కారు విఫలమైంది. ఇలాంటి సమయంలో ఇవాంకా, కుష్నెర్ తమ పిల్లలతో కలిసి విహారయాత్రకు వెళ్లడం ట్రంప్‌కు నచ్చలేదట. ఎందుకంటే ట్రంప్‌ కీలక సలహాదారుల్లో కుష్నెర్ ఒకరు. కీలక సమయంలో అండగా ఉండాల్సిన అల్లుడు సెలవుపై వెళ్లడం ట్రంప్‌కు నచ్చలేదట. వచ్చే గురువారం వరకు ఇవాంకా, కుష్నెర్ టూర్‌లో ఉంటారు. కాగా వైట్ హౌస్ ప్రతినిధి ఈ వార్తలను తోసిపుచ్చారు.
 

Advertisement
 
Advertisement
Advertisement