నోట్ల రద్దుపై మోదీని కడిగిపారేసిన బుడ్డోడు! | toddler criticising PM Narendra Modi for demonetisation | Sakshi
Sakshi News home page

నోట్ల రద్దుపై మోదీని కడిగిపారేసిన బుడ్డోడు!

Dec 15 2016 7:38 PM | Updated on Aug 15 2018 6:34 PM

నోట్ల రద్దుపై మోదీని కడిగిపారేసిన బుడ్డోడు! - Sakshi

నోట్ల రద్దుపై మోదీని కడిగిపారేసిన బుడ్డోడు!

గత నెల 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ ముహూర్తాన ప్రకటన చేశారోగానీ

గత నెల 8న పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ ముహూర్తాన ప్రకటన చేశారోగానీ అప్పటి నుంచి నగదు కోసం సామాన్యులు నానా కష్టాలు పడుతున్నారు. ఎక్కడ చూసినా బ్యాంకుల ముందు, ఏటీఎంల ముందు భారీ క్యూలు దర్శనమిస్తున్నాయి. డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు లేనివాళ్ల పరిస్థితి కనాకష్టంగా ఉంది. చాలావరకు ఏటీఎంలు పనిచేయడం లేదు. కొన్ని సందర్భాల్లో ఎంతసేపు క్యూలో నిలుచున్నా.. డబ్బులు లేవని బ్యాంకులు తిప్పిపంపుతున్న సందర్భాలూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం మాత్ర నగదు రహిత లావాదేవీలవైపు మళ్లాలని ఉదార సలహాలు ఇస్తున్నది. త్వరలోనే కష్టాలు తగ్గుతాయని చెప్తున్నది.

నోట్ల రద్దు విషయంలో మోదీ నిర్ణయాన్ని తప్పుబడుతూ సోషల్‌మీడియాలో, ఆన్‌లైన్‌లో పోస్టులు, వీడియోలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఓ బుడ్డోడి వీడియో హల్‌చల్‌ చేస్తోంది. బుజ్జీబుజ్జీ మాటలతో సామాన్యుల పడుతున్న కష్టాలను ఏకరువు పెడుతూ మోదీని ఈ బుడ్డోడు కడిగిపారేశాడు. వీడియోలో కనిపిస్తున్న అమ్మాయి మాటలు అందిస్తుండగా.. వాటిని పొల్లుపోకుండా స్వచ్ఛమైన హావభావాలతో ఈ బుడ్డోడి చెప్పిన తీరు నెటిజన్ల హృదయాలను గెలుచుకుంటోంది. సోషల్‌ మీడియాలో సూపర్‌ హిట్‌ అయిన ఈ బుడ్డోడి సూపర్‌ వీడియో మీకోసం..!

Advertisement
 
Advertisement
Advertisement