ఆ బాధ్యత అందరిదీ: మోదీ | this responsibility has to be shared by all, says narendra modi | Sakshi
Sakshi News home page

ఆ బాధ్యత అందరిదీ: మోదీ

Jul 20 2015 12:04 PM | Updated on Aug 15 2018 2:20 PM

అఖిలపక్ష భేటీలో రాజ్ నాత్ సింగ్ తో మోదీ - Sakshi

అఖిలపక్ష భేటీలో రాజ్ నాత్ సింగ్ తో మోదీ

భూసేకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.

న్యూఢిల్లీ: భూసేకరణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెడతామని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని అన్నారు. అయితే ఈ బాధ్యతను అన్ని పార్టీలు పంచుకోవాల్సిన అవరసముందని అభిప్రాయపడ్డారు.

భూసేకరణ బిల్లుపై చర్చించేందుకు సోమవారం ఆయన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ సమావేశాలకు ఎంతో ప్రాధాన్యం ఉందని, అన్ని అంశాలపై చర్చించేందుకు వీటిని ఉపయోగించుకోవాలన్నారు. అన్ని అంశాలపై చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభంకానున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement