ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి.. టుక్ టుక్ అంటూ | This Indian-Origin Engineer Travelled 6,200 Miles In His Tuk-Tuk. Know Why | Sakshi
Sakshi News home page

ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి.. టుక్ టుక్ అంటూ

Sep 13 2016 11:34 AM | Updated on Sep 4 2017 1:21 PM

ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి.. టుక్ టుక్ అంటూ

ఇంజనీర్ ఉద్యోగం వదిలేసి.. టుక్ టుక్ అంటూ

పుట్టింది భారతదేశం. ఆస్ట్రేలియాలో ఆటో మొబైల్ ఇంజనీర్ గా పనిచేస్తున్న..

లండన్: పుట్టింది భారతదేశం. ఆస్ట్రేలియాలో ఆటో మొబైల్ ఇంజనీర్ గా పని చేస్తున్న నవీన్ రబెల్లీ(35)కు ఆ దేశం తమ పౌరసత్వాన్ని కూడా ఇచ్చింది. అయితే తాను చేసే ఉద్యోగంతో పాటు మిగిలినవి అతనికి జీవితంలో చిన్నవిగానే కనిపించాయి. అదే సమయంలో స్నేహితుడిని కలిసేందుకు నవీన్ భారత్ కు వెళ్లాడు. ఆయనకు భారతీయ రోడ్లపై తిరుగుతూ పెద్ద మొత్తంలో కాలుష్యాలను విడుదల చేస్తున్న ఆటోలు కనిపించాయి. వాటిని అలానే చూస్తూ ఉండిపోయిన నవీన్ కు మెరుపులాంటి ఆలోచన వచ్చింది. ఎలాగైనా కాలుష్య నివారణపై ప్రజల్లో అవగాహన కలిగించాలనే నిర్ణయానికి వచ్చాడు.

అందుకు అనువైన మార్గాల కోసం అన్వేషించాడు. చివరగా సోలార్ ఆటోతో ప్రపంచ దేశాల్లో కొన్నింటిని చుట్టి ప్రజల్లో అవగాహన తేవాలని నిర్ణయించుకున్నాడు. ఏడు నెలల వ్యవధిలో దాదాపు 6,200 మైళ్ల దూరం ప్రయాణించినట్లు నవీన్ తెలిపాడు. ఈ ఏడు నెలల కాలంలో ఆటో వెనుక భాగాన ఉన్న ఒక బెడ్, ఓ సోలార్ కుక్కర్ లే అతని జీవన సాధనాలు.

పక్కనే ఉన్న చిన్న కప్ బోర్డులో ఆహారం నిల్వ చేసుకుంటూ ప్రయాణం సాగిస్తున్నాడు. తన ప్రయాణాన్ని ఎక్కడి నుంచి ప్రారంభించాలో ఓ నిర్ణయానికి వచ్చిన నవీన్.. ఇండియా నుంచి తన టుక్ టుక్ (నవీన్ తన ఆటోకు పెట్టుకున్న పేరు)తో ఇరాన్ లోని బందర్ అబ్బాస్ పట్టణం చేరుకుని  అక్కడ నుంచి యాత్రను ప్రారంభించాడు. అలా టర్కీ, బల్గేరియా, సెర్బియా, ఆస్ట్రియా, స్విట్జర్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్ గుండా ఆటోను నడుపుకుంటూ ప్రస్తుతం బ్రిటన్ చేరుకున్నాడు.

తాను చేపట్టిన యాత్రపై మాట్లాడిన నవీన్.. యాత్ర మొత్తం సజావుగానే సాగినట్లు తెలిపాడు. టుక్ టుక్ తో సెల్ఫీలను తీసుకునేందుకు ప్రజలు ఆసక్తిని ప్రదర్శించినట్లు చెప్పాడు. టుక్ టుక్ సోలార్ పవర్ తో నడుస్తుందని వారికి తాను చెప్పినప్పుడు ఒకింత ఆశ్చర్యానికి కూడా లోనైనట్లు తెలిపాడు. ఫ్రాన్స్ కు చేరుకున్న తర్వాత తన పర్సు, పాస్ పోర్టులను దుండగులు కొట్టేశారని, అయితే అక్కడినుంచి ప్రజలు చేసిన సాయంతో ముందుకు సాగుతున్నానని.. ఎమర్జెన్సీ పాస్ పోర్టు ద్వారా బ్రిటన్ లోకి ప్రవేశించినట్లు తెలిపాడు. బ్రిటన్ లోని బకింగ్ హామ్ ప్యాలెస్ కు చేరుకున్న తర్వాత యాత్రను ముగించాలనుకుంటున్నట్లు చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement