వారిద్దరికీ 'శౌర్యచక్ర' ఇవ్వాలి | Terrorist nabbing: Shaurya Chakra recommended for 2 civilians | Sakshi
Sakshi News home page

వారిద్దరికీ 'శౌర్యచక్ర' ఇవ్వాలి

Aug 11 2015 7:29 PM | Updated on Mar 23 2019 8:40 PM

ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది నవేద్ - Sakshi

ప్రాణాలతో పట్టుబడ్డ ఉగ్రవాది నవేద్

ఉగ్రవాది నవేద్ ను ప్రాణాలతో భద్రతా బలగాలను పట్టిచ్చిన రాకేశ్ కుమార్ శర్మ, బిక్రమ్ జీత్ 'శౌర్యచక్ర' పురస్కారం ఇవ్వాలని జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రతిపాదించారు.

శ్రీనగర్: పాకిస్థాన్ ఉగ్రవాది మహ్మద్ నవేద్ ను ప్రాణాలతో భద్రతా బలగాలను పట్టిచ్చిన ఇద్దరు పౌరులు రాకేశ్ కుమార్ శర్మ, బిక్రమ్ జీత్ 'శౌర్యచక్ర' పురస్కారం ఇవ్వాలని జమ్మూకశ్మీర్ పోలీసులు ప్రతిపాదించారు. అంతేకాదు వీరిద్దరికీ పోలీసు శాఖలో ఉద్యోగాలిస్తూ అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చారు.

రాకేశ్ ను ఆపరేషనల్ గ్రౌండ్ కానిస్టేబుల్ గా నియమించారు. పాకలాయ్ ప్రాంతానికి చెందిన శర్మ ఉధంపూర్ లోని సిమ్రోలిలో నివసిస్తున్నాడు. జమ్మూలోని నానక్ నగర్ కు చెందిన బిక్రమ్ జీత్ ను ఫాలోవర్ గా అపాయింట్ చేశారు. క్వాలిఫికేషన్ విషయంలో బిక్రమ్ కు మినహాయింపు ఇవ్వాలని డీజీపీ కె రాజేంద్ర కుమార్ ఆదేశించారు.

ఈనెల 5న ఉధంపూర్ దగ్గర్లోని సిమ్రోలి గ్రామంలో నవేద్ ను పట్టుకున్నారు. తమను బందీలుగా పట్టుకున్న నవేద్ ఎదిరించి రాకేశ్, బిక్కమ్ అతడిని పట్టుకున్నారు. అతడితో పాటు వచ్చిన మరో ఉగ్రవాదిని భద్రతా బలగాలు హతమార్చాయి. అంతకు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందగా, మరో 11 మంది గాయపడ్డారు. రాకేశ్,  బిక్రమ్ చూపిన తెగువను జాతి యావత్తు ముక్తకంఠంతో కొనియాడింది.

Advertisement
 
Advertisement
Advertisement