విపక్షాల బంద్ అట్టర్ఫ్లాప్ | Telangana ministers takes on opposition parties | Sakshi
Sakshi News home page

విపక్షాల బంద్ అట్టర్ఫ్లాప్

Oct 10 2015 2:02 PM | Updated on Sep 3 2017 10:44 AM

రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేయాలంటూ పిలుపు ఇచ్చిన విపక్షాల బంద్ అట్టర్ఫ్లాప్ అయిందని మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు.

హైదరాబాద్: రైతులకు ఒకే దఫా రుణమాఫీ చేయాలంటూ పిలుపు ఇచ్చిన విపక్షాల బంద్ అట్టర్ఫ్లాప్ అయిందని మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు ఎద్దేవా చేశారు. శనివారం వారు హైదరాబాద్లో విలేకర్లతో మాట్లాడుతూ.. రైతులెవరూ ఈ బంద్లో పాల్గొనలేదని తెలిపారు. రైతులకిచ్చిన మాటను నిలబెట్టుకుంటామని వారు ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

ఆంధ్రప్రదేశ్లో కూడా రైతుల ఆత్మహ్యతలు జరుగుతున్నాయని పోచారం, జూపల్లి ఈ సందర్భంగా గుర్తు చేశారు. కానీ ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ఎందుకు ఆందోళన చేయడం లేదని ప్రశ్నించారు. ఓ వేళ అధికార టీడీపీలో ఏపీ కాంగ్రెస్ పార్టీ విలీనమైయిందా అని వారు సందేహం వ్యక్తం చేశారు. త్వరలోనే రైతులకు వన్టైమ్ సెటిల్మెంట్ చేస్తామని పోచారం,జూపల్లి తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement