ఎయిర్‌ఏషియాకు అంతా తెలుసు | Tata Group says AirAsia kept in the loop on Singapore Airlines JV | Sakshi
Sakshi News home page

ఎయిర్‌ఏషియాకు అంతా తెలుసు

Sep 24 2013 3:24 AM | Updated on Sep 1 2017 10:59 PM

రెండు విమానయాన సంస్థలతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసుకోవడంపై వస్తున్న ఆరోపణల మీద టాటా గ్రూప్ స్పందించింది.

 ముంబై: రెండు విమానయాన సంస్థలతో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసుకోవడంపై వస్తున్న ఆరోపణల మీద టాటా గ్రూప్ స్పందించింది. తాము సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తో జేవీ ఏర్పాటు చేస్తున్న సంగతి గురించి ఎయిర్‌ఏషియాకి ముందు నుంచే తెలుసని టాటా గ్రూప్ ప్రతినిధి ముకుంద్ రాజన్ తెలిపారు. దీనిపై ఎయిర్‌ఏషియా ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయలేదన్నారు. రెండు జేవీలను కొనసాగించేందుకే తాము కట్టుబడి ఉన్నామని, ఇందులో సమస్యలేమీ తలెత్తకపోవచ్చని రాజన్ అభిప్రాయపడ్డారు. చౌక విమాన సర్వీసులు అందించేందుకు ఎయిర్‌ఏషియా, టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్‌తోనూ.. పూర్తి స్థాయి సేవలు అందించేందుకు సింగపూర్ ఎయిర్‌లైన్స్‌తోనూ టాటా గ్రూప్ చేతులు కలిపిన సంగతి తెలిసిందే. అయితే, సింగపూర్ ఎయిర్‌లైన్స్ గురించి టాటా గ్రూప్ తనకు చెప్పలేదంటూ టెలిస్ట్రా ట్రేడ్‌ప్లేస్ ప్రమోటర్ అరుణ్ భాటియా వ్యాఖ్యానించడం తాజా వివాదానికి దారి తీసింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement