ఎమ్మెల్యే చెన్నమనేనిపై సుప్రీం ఆగ్రహం | supreme serious on chennamaneni ramesh | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే చెన్నమనేనిపై సుప్రీం ఆగ్రహం

Sep 15 2015 1:01 PM | Updated on Sep 2 2018 5:24 PM

ఎమ్మెల్యే చెన్నమనేనిపై సుప్రీం ఆగ్రహం - Sakshi

ఎమ్మెల్యే చెన్నమనేనిపై సుప్రీం ఆగ్రహం

కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఢిల్లీ: కరీంనగర్ జిల్లా వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అనర్హత వేటు పిటిషన్ విచారణలో ఉన్నా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎలా ఓటు వేస్తారని ప్రశ్నించింది. అనర్హత వేటు పిటిషన్ విచారణలో ఉన్నా చెన్నమనేని ఓటు వేశారని ఆదిశ్రీనివాస్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దానిపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయడాన్ని తప్పుపట్టింది. ఈ విషయంపై రెండు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని రమేష్ ను సుప్రీంకోర్టు ఆదేశించింది.
 

Advertisement
 
Advertisement
Advertisement