ప్రిన్సిపాల్ను హత్యచేసిన విద్యార్థి | Student kills college principal in Jharkhand | Sakshi
Sakshi News home page

ప్రిన్సిపాల్ను హత్యచేసిన విద్యార్థి

Oct 14 2015 7:10 PM | Updated on Nov 9 2018 5:02 PM

ప్రిన్సిపాల్ను హత్యచేసిన విద్యార్థి - Sakshi

ప్రిన్సిపాల్ను హత్యచేసిన విద్యార్థి

జార్ఖండ్లో ఓ విద్యార్థి.. కాలేజీ ప్రిన్సిపాల్ను దారుణంగా హత్య చేశాడు.

రాంచీ: జార్ఖండ్లో ఓ విద్యార్థి.. కాలేజీ ప్రిన్సిపాల్ను దారుణంగా హత్య చేశాడు. గుమ్లా జిల్లాలో కార్తీక్ ఒరయెన్ కాలేజీ ప్రిన్సిపాల్ శశిభూషణ్ ప్రసాద్ ఆఫీసులో ఉన్నప్పుడు విద్యార్థి ఆయనపై దాడికి పాల్పడ్డాడు.

నిందితుడు పదునైన ఆయుధంతో ప్రిన్సిపాల్ మెడపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన ప్రిన్సిపాల్ను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మరణించినట్టు వైద్యులు చెప్పారు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. జార్ఖండ్లోనే మరో సంఘటనలో ఓ పూజారిని గుర్తుతెలియని వ్యక్తి కాల్చిచంపాడు.  
 

Advertisement
 
Advertisement
Advertisement