'ముందు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి' | SP chief should first introspect his party's performance, says BJP | Sakshi
Sakshi News home page

'ముందు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి'

Sep 7 2014 8:14 PM | Updated on Aug 14 2018 4:44 PM

'ముందు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి' - Sakshi

'ముందు మీరు ఆత్మపరిశీలన చేసుకోండి'

తమను విమర్శించే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కు బీజేపీ సూచించింది.

లక్నో: తమను విమర్శించే ముందు ఆత్మపరిశీలన చేసుకోవాలని సమాజ్వాది పార్టీ అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ కు బీజేపీ సూచించింది. కేంద్రంలో మూడు నెలల ఎన్డీఏ పాలనను నిందించేముందు ఉత్తరప్రదేశ్ లో 30 నెలల పాలనపై ఆత్మపరీక్ష చేసుకోవాలని ములాయంకు బీజేపీ అధికార ప్రతినిధి విజయ్ బహదుర్ పాఠక్ సూచించారు.

30 నెలల్లో హామీలు నెలబెట్టుకోని సమాజ్వాది పార్టీ ప్రభుత్వం మూడు నెలల ఎన్డీఏ పాలనను తప్పుబట్టడం హాస్యాస్పదమని అన్నారు. ఎన్నికల హామీలను నిలబెట్టుకోవడంలో నరేంద్ర మోడీ విఫలమయ్యారంటూ ములాయం చేసిన విమర్శలను పాఠక్ తప్పుబట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement