ఈవ్‌టీజర్ల నుంచి బాలికను రక్షించబోయి.. | Soldier Beaten to Death for Trying to Stop Men From Harassing Girl in Meerut | Sakshi
Sakshi News home page

ఈవ్‌టీజర్ల నుంచి బాలికను రక్షించబోయి..

Aug 16 2015 9:58 AM | Updated on Sep 3 2017 7:33 AM

శోకసంద్రంలో  వేదమిత్ర చౌధరీ కుటుంబ సభ్యులు

శోకసంద్రంలో వేదమిత్ర చౌధరీ కుటుంబ సభ్యులు

ఓ బాలికను కాపాడబోయిన జవానును ఈవ్‌టీజర్లు బలి తీసుకున్నారు.

మీరట్(యూపీ): ఓ బాలికను కాపాడబోయిన జవానును ఈవ్‌టీజర్లు బలి తీసుకున్నారు. మీరట్‌లో ఈవ్‌టీజర్ల దాడిలో గురువారం తీవ్రంగా గాయపడిన వేదమిత్ర చౌధరీ(35) అనే జవాను ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మరణించారు. మీరట్‌లోని హర్‌దేవ్‌నగర్, రోహ్తా రోడ్డులో గల ఓ పాల బూత్ యజమాని కూతురిని పలువురు యువకులు వేధిస్తుండగా అక్కడికి పాలకోసం వెళ్లిన జవాను వారిని వారించారు.

బాలికను కాపాడేందుకు యువకుల్లో ఒకడిపై చేయి కూడా చేసుకున్నారు. దీంతో రెచ్చిపోయిన ఆ యువకుడు తన స్నేహితులను పిలవడంతో వారు కర్రలు, ఆయుధాలతో వచ్చి చౌధరిని తీవ్రంగా గాయపర్చారు. చౌధరీ నగరంలోని గోపాల్ విహార్‌లో భార్య, పిల్లలతో నివసిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేశామని, ఇతరుల కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement