పాక్పై ప్రతీకారానికి మానవబాంబులా... | Shiv Sena activists ready to become human bombs to destroy Pakistan | Sakshi
Sakshi News home page

పాక్పై ప్రతీకారానికి మానవబాంబులా...

Sep 27 2016 3:53 PM | Updated on Sep 4 2017 3:14 PM

పాక్పై ప్రతీకారానికి మానవబాంబులా...

పాక్పై ప్రతీకారానికి మానవబాంబులా...

ఉడి ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర చిచ్చు చెలరేగింది. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోకుండా కేంద్రప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టుకుంటుందని విమర్శించిన శివసేన, పాకిస్తాన్ను నాశనం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది.

సూరత్ : ఉడి ఉగ్రదాడి ఘటనతో భారత్, పాకిస్తాన్ల మధ్య తీవ్ర చిచ్చు చెలరేగింది. పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకోకుండా కేంద్రప్రభుత్వం కేవలం మాటలతో సరిపెట్టుకుంటుందని విమర్శించిన శివసేన, పాకిస్తాన్ను నాశనం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. పాకిస్తాన్ను నాశనం చేయడానికి తమ కార్యకర్తలు మానవబాంబుల మారతారని ప్రకటిస్తూ..  దీనికి సంబంధించిన ఓ మెమోరాండంను  జిల్లా కలెక్టర్కు సమర్పించింది. ఈ మెమోరాండంలో సూరత్కు చెందిన 28 శివసేన కార్యకర్తలు, పాకిస్తాన్ అంతుచూడటానికి మానవబాంబుల మారతామని గుజరాత్కు ఆఫర్ చేసింది. ఒకవేళ ఇండియా, పాకిస్తాన్తో యుద్ధానికి దిగితే, గాయాలపాలైన జవాన్లకు తాము అవయవాలు దానం చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు శివసేన కార్యకర్తలు ఆ మెమోరాండంలో వెల్లడించారు.
 
సూరత్ శివసేన అధ్యక్షుడు అరుణ్ కలాల్ ఈ వార్తను ధృవీకరించారు. 28 శివసైనికులు మానవ బాంబులుగా మారడానికి సిద్ధంగా ఉన్నారని వారి సంతకాలతో కూడా ఓ మెమోరాండంను సోమవారం కలెక్టర్కు సమర్పించారు.  గత రెండేళ్లుగా పాకిస్తాన్ చేస్తున్న కుట్రపూరిత చర్యలకు భారత్ ఎలాంటి ప్రతీకారం తీర్చుకోవడం లేదని, ఉడీ ఘటన అనంతరం పాకిస్తాన్కు ఇండియా ఎలాంటి శిక్ష విధించబోతుందోనని ప్రపంచమంతా ఎదురుచూస్తుందని శివసేన పేర్కొంది. ఉడి ఉగ్రదాడి తర్వాత చాలా దేశాలు ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యాయని తెలిపింది. భారత్ పటిష్టతత్వాన్ని కేవలం ఒక్క దేశమే దెబ్బతీయలేదని, తగిన జవాబు చెప్పేందుకు తాము సిద్ధంగా ఉన్నట్టు హెచ్చరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement