బీజేపీకి అవకాశం ఇవ్వండి:షీలా దీక్షిత్ | Sheila Dikshit backs BJP's bid to form govt | Sakshi
Sakshi News home page

బీజేపీకి అవకాశం ఇవ్వండి:షీలా దీక్షిత్

Sep 11 2014 8:10 PM | Updated on Mar 29 2019 9:24 PM

బీజేపీకి అవకాశం ఇవ్వండి:షీలా దీక్షిత్ - Sakshi

బీజేపీకి అవకాశం ఇవ్వండి:షీలా దీక్షిత్

ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమివ్వాలని, ఆ రకంగా అవకాశం ఇవ్వడం కూడా ప్రజలకు మంచిదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ: ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమివ్వాలని, ఆ రకంగా అవకాశం ఇవ్వడం కూడా ప్రజలకు మంచిదని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత షీలా దీక్షిత్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నేత నోటనుంచి తమకు మద్దతుగా వెలువడిన ఈ వ్యాఖ్యలపట్ల బీజేపీ హర్షం వ్యక్తంచేయగా, ఆమె వ్యాఖ్యలు వ్యక్తిగతమని ఆ వ్యాఖ్యలతో పార్టీకి సంబంధంలేదని  కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
 

ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాలు ఉండటమే మంచిదని, ప్రభుత్వం ఏర్పాటుచేసే స్థాయికి బీజేపీ చేరుకుని ఉంటే బీజేపీ ఆ పనిచేయవచ్చని షీలా దీక్షిత్ గురువారం ఢిల్లీలో వ్యాఖ్యానించారు. ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటుకోసం బీజేపీ ఎమ్మెల్యేల వేటలో పడిందంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ తీవ్రంగా ఆరోపిస్తున్న నేపథ్యంలో షీలా దీక్షిత్ ఈ వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఎన్నికలు కావాలని కాంగ్రెస్‌గానీ, ఆప్‌గానీ కోరుకోవడంలేదని షీలా దీక్షిత్ అన్నారు. అయితే,..ప్రభుత్వం ఎలా ఏర్పడుతుంది? మైనారిటీ ప్రభుత్వం ఎదుర్కొనే సవాళ్లేమిటి?..ఇవన్నీ బీజేపీకి సంబందించినవేనని ఆమె అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement