స్కూలు బస్ ప్రమాదం.. చిన్నారుల మృత్యువాత | Several die in US school bus accident | Sakshi
Sakshi News home page

స్కూలు బస్ ప్రమాదం.. చిన్నారుల మృత్యువాత

Nov 22 2016 8:32 AM | Updated on Sep 28 2018 3:39 PM

స్కూలు బస్ ప్రమాదం.. చిన్నారుల మృత్యువాత - Sakshi

స్కూలు బస్ ప్రమాదం.. చిన్నారుల మృత్యువాత

అమెరికాలో మంగళవారం ఘోర బస్సు ప్రమాదం సంభవించింది.

వాషింగ్టన్: అమెరికాలో  ఘోర బస్సు ప్రమాదం సంభవించింది.   టెనస్సీ లోని ఓ పాఠశాలకు  చెందిన బస్సు  చెట్టును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం సంభవించింది.  ఈ ప్రాణాంతకమైన ప్రమాదంలో  పలువురు చిన్నారులు మృత్యువాత పడినట్టు తెలుస్తోంది.  కిండర్ గార్టెన్ ,  ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 35 మందితో వెళ్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది.  సంఘటనా స్థలానికి చేరుకున్న  అధికారులు  సహాయక చర్యల్ని చేపట్టారు.  గాయపడిన చిన్నారులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఎంతమంది మరణించారనేది ఇపుడే చెప్పలేమని,  తీవ్ర గాయాలపాలైన 20 మందిని ఆసుపత్రికి తరలించినట్టు ఛత్తనూగ పోలీసు అధికారి ట్రేసీ ఆర్నాల్డ్  తెలిపారు.  అయితే ఎక్కువమంది చనిపోయి వుంటారని భావిస్తున్నామన్నారు. మరోవైపు హామిల్టన్ కౌంటీ ప్రాసిక్యూటర్ కార్యాలయం ఆరుగురు చనిపోయారని నివేదించింది.  సుమారు 12 మంది  పిల్లలు చనిపోయారని  స్థానిక మీడియా వెల్లడించింది.  దీనిపై పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.


 

Advertisement
 
Advertisement
Advertisement