బాలీవుడ్ సెలబ్రిటీలకు శివసేన బాసట | Sena opposes action against celebrities who endorsed Maggi | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ సెలబ్రిటీలకు శివసేన బాసట

Jun 4 2015 10:59 AM | Updated on Apr 3 2019 6:23 PM

బాలీవుడ్ సెలబ్రిటీలకు శివసేన బాసట - Sakshi

బాలీవుడ్ సెలబ్రిటీలకు శివసేన బాసట

'మ్యాగీ నూడుల్స్' వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్ ప్రముఖులకు శివసేన బాసటగా నిలిచింది.

ముంబై: 'మ్యాగీ నూడుల్స్' వివాదంలో ఇరుక్కున్న బాలీవుడ్ ప్రముఖులకు శివసేన బాసటగా నిలిచింది. మ్యాగీ ప్రకటనల్లో నటించినందుకు బాలీవుడ్ తారలపై కేసులు నమోదు చేయడాన్ని తప్పుబట్టింది. వాణిజ్య ప్రకటనల్లో నటించే సెలబ్రిటీలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. మ్యాగీ నూడుల్స్‌లో పరిమితికి మించిన హానికర రసాయనాలు ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో మాధురీ దీక్షిత్, అమితాబ్ బచ్చన్, ప్రీతి జింతా న్యాయపరమైన చిక్కుల్లో పడ్డారు.

మ్యాగీ  తయారీలో నిబంధనలు ఉల్లంఘించినా ఇప్పటివరకు క్వలిటీ కంట్రోల్ విభాగం ఏం చేస్తోందని శివసేన అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ నీలమ్ గోర్హి ప్రశ్నించారు. ఈ నిర్లక్ష్యం కారణంగా పలుతరాలు ఆరోగ్య పరంగా నష్టపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా ఉత్పత్తిని ప్రమోట్ చేసేముందు దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలని బ్రాండ్ అంబాసిడర్లు, మోడల్స్, నటులకు ఆమె సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement