జయలలితకు మరోసారి బెయిల్ పొడిగింపు | SC extends bail for Jayalalithaa | Sakshi
Sakshi News home page

జయలలితకు మరోసారి బెయిల్ పొడిగింపు

Apr 17 2015 1:54 PM | Updated on Sep 27 2018 8:37 PM

జయలలితకు  మరోసారి బెయిల్ పొడిగింపు - Sakshi

జయలలితకు మరోసారి బెయిల్ పొడిగింపు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కొంత ఊరట లభించింది

న్యూఢిల్లీ: తమిళనాడు మాజీ  ముఖ్యమంత్రి జయలలితకు కొంత ఊరట లభించింది. ఆమె బెయిల్ గడువు మరోసారి పొడగించింది ధర్మాసనం. అక్రమ ఆస్తుల కేసులో జైలుకెళ్లిన  జయలలిత బెయిల్ను సుప్రీంకోర్టు  మే 12వ తేదీవరకు  పొడిగించింది.  జయలలిత తదితరులకు మే 12వ తేదీవరకు బెయిల్ను పొడిగిస్తూ ఎపెక్స్ కోర్టు చీఫ్ జస్టిస్  హెచ్ఎల్ దత్తు ఆదేశాలు జారీచేశారు.
కాగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయలలితకు శిక్ష పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బెయిల్‌పై ఉన్న ఆమెకు గత డిసెంబర్ 18న సుప్రీంకోర్టు నాలుగు నెలలు బెయిల్ గడువు పొడిగించింది. 

 

Advertisement
 
Advertisement
Advertisement