ఎస్బీఐ లాభాలు.. ప్చ్. | SBI Net Profit Falls On Higher Provisions, Shares Slump 3% | Sakshi
Sakshi News home page

ఎస్బీఐ లాభాలు.. ప్చ్.

Nov 11 2016 1:40 PM | Updated on Jul 11 2019 8:56 PM

ఎస్బీఐ లాభాలు.. ప్చ్. - Sakshi

ఎస్బీఐ లాభాలు.. ప్చ్.

ప్రభుత్వరంగ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఈ ఆర్థిక సంవత్సరానికి నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. అంచనా వేసినట్టుగానే జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి నికర లాభాలు భారీగా క్షీణించాయి. పెరిగిన నిరర్ధక ఆస్తులు సంస్థకు నష్టాలు తెచ్చిపెట్టాయి.

ముంబై:  ప్రభుత్వరంగ  దిగ్గజ బ్యాంక్  స్టే ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాఈ ఆర్థిక సంవత్సరానికి నిరాశాజనక ఫలితాలను ప్రకటించింది. అంచనా వేసినట్టుగానే జూలై- సెప్టెంబర్ త్రైమాసికానికి నికర లాభాలు భారీగా క్షీణించాయి.  పెరిగిన నిరర్ధక ఆస్తులు సంస్థకు నష్టాలు తెచ్చిపెట్టాయి. రెండో త్రైమాసికంలో పన్ను తర్వాతి నికర లాభం రూ. 2,538.32 కోట్లుగా నమోదైంది. గతేడాది క్యూ2లో ఇది రూ. 3,879 కోట్లుగా ఉంది. మొత్తం నికర లాభాలు 35 శాతం క్షీణించాయి. ఆదాయం రూ. 40,657 కోట్ల నుంచి రూ. 42,318 కోట్లకు పెరిగినా.. ఎన్‌పీఏలు పెరగడం ఫలితాలపై ప్రభావం చూపింది.

క్యూ2లో ఎస్బీ‌ఐకు స్థూల నిరర్ధక ఆస్తులు రూ.1.05 లక్షల కోట్లుగా నమోదు కాగా.. గతేడాది ఇది రూ. 1.01 లక్షల కోట్లుగా ఉంది. 6.94 శాతం నుంచి 7.14 శాతానికి పెరిగిన గ్రాస్ ఎన్‌పీఏలు పెరిగాయి. ఇక నికర ఎన్‌పీఐఏలు కూడా 4.15 శాతం నుంచి 4.19 శాతానికి పెరిగాయి. బ్యాడ్ లోన్ ప్రొవిజిన్స్ రూ. 6340 కోట్ల నుంచి రూ.7,670 కోట్లకు ఎగిశాయి.  ప్రొవిజన్స్ కవరేజ్ రేషియో ఏకంగా 62.12 శాతానికి చేరుకుంది. క్యూ2లో ప్రొవిజన్స్ రూ. 7413 కోట్ల నుంచి రూ. 7897 కోట్లకు చేరుకున్నాయి.  కాగా ఈ ఫలితాల ప్రభావంతో 2.59 శాతం నష్టపోయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement