సుష్మాకు చీరను కానుకగా ఇచ్చిన బంగ్లా మాజీ ప్రధాని | Saree diplomacy features Swaraj's Bangladesh visit | Sakshi
Sakshi News home page

సుష్మాకు చీరను కానుకగా ఇచ్చిన బంగ్లా మాజీ ప్రధాని

Jun 27 2014 5:56 PM | Updated on Aug 15 2018 2:20 PM

బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వరుస చీరలను అందుకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు.

ఢాకా: బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ వరుస చీరలను అందుకుంటూ ఆనందంలో మునిగి తేలుతున్నారు. నిన్న బంగ్లా ప్రధాని షేక్ హసీనా నుంచి ఒక చీరను అందుకున్న సుష్మాకు.. మరొ రెండు చీరలు కానుకగా వచ్చాయి. ఆ చీరలను బంగ్లా మాజీ ప్రధాని ఖలేదా జియా సుష్మాకు శుక్రవారం కానుకగా ఇచ్చారు.  ఈ రోజు జియాతో భేటీ అయిన సుష్మాకు చీరలతో స్వాగతం పలికారు.  తాము తీసుకున్న రెండు చీరల్లో ఒకటి సుష్మాకు, మరొకటి ఆమె కుమార్తెకు అని జియా ప్రెస్ సెక్రటరీ మారుఫ్ కమల్ సోహెల్ తెలిపారు.
 

తొలి రోజు చీరను అందుకున్నముందుగా చీరను అందుకున్న హసీనా సుష్మా స్వరాజ్ ను తన సహోదరితో పోల్చుకుంది. తన సోదరి చీరను కానుకగా ఇచ్చిందంటూ హసీనా ఆనందం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement