ఆ కారణాలను శాంసంగ్ కనిపెట్టేసింది.. | Samsung Galaxy Note 7 Explosion Investigation Completed, Findings Submitted to Regulators: Report | Sakshi
Sakshi News home page

ఆ కారణాలను శాంసంగ్ కనిపెట్టేసింది..

Published Mon, Dec 19 2016 1:19 PM | Last Updated on Mon, Sep 4 2017 11:07 PM

ఆ కారణాలను శాంసంగ్ కనిపెట్టేసింది..

ఆ కారణాలను శాంసంగ్ కనిపెట్టేసింది..

సుదీర్ఘకాల విచారణ అనంతరం ఎట్టకేలకు దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ నోట్7 పేలుళ్ల కారణాలు కనిపెట్టేసింది.

సుదీర్ఘకాల విచారణ అనంతరం ఎట్టకేలకు దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ నోట్7 పేలుళ్ల కారణాలు కనిపెట్టేసింది. గెలాక్సీ నోట్7 పేలుడుకు గల మూల కారణాలను తాము కనుగొన్నామని శాంసంగ్ రిపోర్టు చేసింది. ఈ కారణాల రిపోర్టును కొరియా టెస్టింగ్ ల్యాబోరేటరీకి, ఇతర రెగ్యులేటరీ సంస్థలకు శాంసంగ్ సమర్పించింది. అయితే ఈ వివరాలను ఇంకా ప్రజలకు వెల్లడించలేదు.  పేలుళ్ల కారణాలను కనుగొన్నాం, వాటిని రెగ్యులేటరీకి సమర్పించామని మాత్రమే ఈ దక్షిణ కొరియా దిగ్గజం పేర్కొంది. గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో శాంసంగ్ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. గెలాక్సీ నోట్7 ఫోన్లలన్నింటినీ రీకాల్ చేసి సమస్యను పునరుద్ధరించుకుని మళ్లీ కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.
 
అయినప్పటికీ ఆ సంస్థను పేలుళ్ల సమస్య వెన్నాడుతూనే ఉంది. దీంతో తమ ఫోన్లను వెనక్కిచేయలంటూ కంపెనీ ప్రకటించింది. పేలుళ్లకు అసలు మూల కారణాలేమిటో తెలుసుకోవడం కోసం ఓ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్ను కంపెనీ నియమించింది.  ప్రస్తుతం అంతర్గత విచారణ పూర్తయిందని, ఈ రిపోర్టులను బయట ల్యాబోరేటరీలకు పంపించామని శాంసంగ్ వెల్లడించింది.  ఎంతో ప్రతిష్టాత్మకంగా గెలాక్సీ నోట్7 ఫోన్ను శాంసంగ్ ప్రవేశపెట్టింది. కానీ ఈ ఫోన్కు పేలుళ్ల సమస్య తలెత్తడంతో ఎంతోకాలంగా కంపెనీ సాధించుకున్న ప్రతిష్ట మట్టిపాలైంది. చాలామంది గెలాక్సీ కస్టమర్లు ఇతర ఫోన్లకు తరలివెల్లారు. కంపెనీ త్రైమాసిక ఫలితాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. పేలుళ్ల సమస్య కనుగొనే వరకు గెలాక్సీ 8ను కూడా విడుదల చేయమని కంపెనీ జాప్యం చేస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ఫిబ్రవరిలో ఉండే అవకాశముందని తెలుస్తోంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement