వారితో సమంత స్పెషల్‌ దీపావళి! | Samantha special deepavali | Sakshi
Sakshi News home page

వారితో సమంత స్పెషల్‌ దీపావళి!

Oct 31 2016 3:39 PM | Updated on Sep 4 2017 6:48 PM

నలుగురితో కలిసి పంచుకుంటూనే ఏ పండుగైనా అందంగా ఉంటుంది. ఆనందాన్ని పంచుతోంది.

నలుగురితో కలిసి పంచుకుంటూనే ఏ పండుగైనా అందంగా ఉంటుంది. ఆనందాన్ని పంచుతోంది. అందుకే చిన్నారుల మోములపై ఆనందపు వెలుగులు పూయిస్తూ.. వారితో కలిసి ఈ దివ్వెల పండుగను జరుపుకొంది సమంత. దీపావళి పండుగ సందర్భంగా తాను నిర్వహిస్తున్న స్వచ్ఛంద సంస్థ ‘ప్రత్యూష’ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి చిన్నారులతో ఆనందంగా గడిపింది సామ్‌. వారితో కలిసి సరదాగా కాకరవొత్తులు వెలిగిస్తూ.. ఆ నవ్వుల వెలుగుల దివాలీ ఫొటోను ఆమె తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్టు చేసింది.

నిరుపేద మహిళలు, చిన్నారులకు వైద్యసహాయం అందించేందుకు సమంత ‘ప్రత్యూష ఆర్గనైజేషన్‌’  అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించిన సంగతి తెలిసిందే. నిరుపేద చిన్నారులకు సాయం అందిస్తున్న ఈ సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇటీవల మరో టాలీవుడ్‌ హీరోయిన్‌ రాశీ ఖన్నా కూడా పాల్గొన్నది.

ఇక అభిమానులను మురిపించడానికి ఒక అందమైన పార్టీ ఫొటోను కూడా సమంత ఇన్‌స్టాగ్రామ్‌ షేర్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement