సాక్షి జర్నలిజం స్కూల్‌ ఫలితాలు విడుదల | Sakshi journalism school entrance exam results declared | Sakshi
Sakshi News home page

సాక్షి జర్నలిజం స్కూల్‌ ఫలితాలు విడుదల

Mar 20 2017 2:37 AM | Updated on Sep 5 2018 8:36 PM

సాక్షి జర్నలిజం స్కూల్‌ ఫలితాలు విడుదల - Sakshi

సాక్షి జర్నలిజం స్కూల్‌ ఫలితాలు విడుదల

ప్రింట్, టీవీ, వెబ్‌ జర్నలిజం విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సాక్షి జర్నలిజం స్కూల్‌ మార్చి 5న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను ప్రిన్సిపల్‌ దిలీప్‌రెడ్డి విడుదల చేశారు.

- మార్చి 30 నుంచి ఇంటర్వ్యూలు
హైదరాబాద్‌: ప్రింట్, టీవీ, వెబ్‌ జర్నలిజం విభాగాల్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు సాక్షి జర్నలిజం స్కూల్‌ మార్చి 5న నిర్వహించిన రాత పరీక్ష ఫలితాలను ప్రిన్సిపల్‌ దిలీప్‌రెడ్డి విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో 1,208 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవగా 284 మంది బృంద చర్చలు, ఇంటర్వ్యూలకు ఎంపికయ్యారు. వీరికి మార్చి 30 నుంచి హైదరాబాద్‌ బంజారాహిల్స్, రోడ్‌ నంబర్‌ 1లోని సాక్షి ప్రధాన కార్యాలయంలో బృంద చర్చలు, ఇంటర్వ్యూలు జరుగుతాయి.

కాల్‌ లెటర్లను www.sakshischoolofjournalism.com వెబ్‌సైట్‌లో సోమవారం సాయంత్రం 6 గంటల నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అభ్యర్థులు హాల్‌టికెట్, కాల్‌ లెటర్, 4 పాస్‌పోర్ట్‌ సైజు ఫొటోలు, విద్యార్హతల సర్టిఫికెట్లు, వాటి జిరాక్స్‌లతోపాటు వయసు నిర్ధారణ కోసం పదో తరగతి మెమో తప్పనిసరిగా తీసుకురావాలి. నిర్దేశిత తేదీన సూచించిన సమయానికి సాక్షి ప్రధాన కార్యాలయంలో రిపోర్ట్‌ చేయాలి.

Advertisement
 
Advertisement
Advertisement