సాహో.. బాలకృష్ణ.. శాతకర్ణి! | Saaho Basavatarakarama puthra BALAKRISHNA, says rajamouli | Sakshi
Sakshi News home page

సాహో.. బాలకృష్ణ.. శాతకర్ణి!

Jan 12 2017 8:55 AM | Updated on Jul 14 2019 4:05 PM

సాహో.. బాలకృష్ణ.. శాతకర్ణి! - Sakshi

సాహో.. బాలకృష్ణ.. శాతకర్ణి!

నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' బుధవారం విడుదల అవుతున్న సందర్భంగా ట్విట్టర్ లో బాలయ్యకు అభినందనలు వెల్లువెత్తాయి.

నందమూరి బాలకృష్ణ వందో సినిమాగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన 'గౌతమీపుత్ర శాతకర్ణి' బుధవారం విడుదల అవుతున్న సందర్భంగా ట్విట్టర్ లో బాలయ్యకు అభినందనలు వెల్లువెత్తాయి. సినిమా ఘనవిజయం సాధించాలంటూ తెలుగు సినీ ప్రముఖులంతా సోషల్ మీడియాలో ఆకాంక్షించారు.

'స్వాహో బసవతారకమ్మ పుత్ర బాలకృష్ణ. నందమూరి తారక రామారావుగారి గర్వపడేరీతిలో శాతకర్ణిగా నటించిన (బాలకృష్ణ) సార్ కు సెల్యూట్ చేస్తున్నా. పైనుంచి ఎన్టీఆర్ ఆశీస్సులు మీకు ఉంటాయి' అని ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి ట్వీట్ చేశారు. ' అజంనాపుత్ర క్రిష్.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న 12కోట్లమంది తెలుగువారి ఆశీస్సులు నీకు ఉన్నాయి. 79 రోజుల్లో ఈ ఎపిక్ సినిమాను మీరు ఎలా తీశారు? నమ్మశక్యం లేదు. మీ నుంచి నేను చాలాచాలా మార్చుకోవాలి. సాయిమాధవ్ గారు మీ పెన్నే శాతకర్ణి కత్తి. అద్భుతమైన కెమెరా వర్క్, అసాధారణ నిర్మాణ విలువలు గర్వించే తెలుగు సినిమాగా శాతకర్ణిని చాలారోజులు గుర్తుండిపోయేలా చేస్తాయి' అని రాజమౌళి పేర్కొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement