రానా చెప్పిన షాకింగ్‌ నిజం.. వైరల్‌! | Rana is blind in one eye | Sakshi
Sakshi News home page

రానా చెప్పిన షాకింగ్‌ నిజం.. వైరల్‌!

May 1 2017 4:10 PM | Updated on Sep 5 2017 10:08 AM

రానా చెప్పిన షాకింగ్‌ నిజం.. వైరల్‌!

రానా చెప్పిన షాకింగ్‌ నిజం.. వైరల్‌!

రానా చెప్పిన ఓ షాకింగ్‌ నిజం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.

గతవారం విడుదలైన ‘బాహుబలి-2’ ఊహించినట్టుగానే బాక్సాఫీస్‌ వద్ద రికార్డుల మోత మోగిస్తోంది. ఈ సినిమాలో ‘బాహుబలి’గా కనిపించిన ప్రభాస్‌కు ఎంతైతే పాపులారిటీ వచ్చిందో.. విలన్‌ ‘భల్లాల దేవ’గా కనిపించిన రానాకు కూడా అంతే ప్రశంసలు దక్కుతున్నాయి. కండలు తిరిగిన భారీ దేహంతో బాహుబలికి దీటైన విలన్‌గా రానా మెప్పించాడు. ఈ నేపథ్యంలో రానా చెప్పిన ఓ షాకింగ్‌ నిజం ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. అది సినిమా గురించి కాదు.. తన గురించే.. రానాకు ఒక కన్ను మాత్రమే కనిపిస్తుంది. ఆయన కుడి కన్ను పనిచేయదు. గతంలో మంచు లక్ష్మి ‘నేనుసైతం’ టీవీ షోకు హాజరైన రానానే ఈ విషయాన్ని స్వయంగా చెప్పాడు.

కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో బాధితులకు ధైర్యం చెప్తూ రానా ఈ విషయాన్ని వెల్లడించాడు. ‘దేవుడు ధైర్యం ఉన్నవాళ్లకే కష్టాలు ఇస్తాడు. నీకోటి తెలుసా నాకు ఒక కన్ను లేదు. ఒక కంట్లోంచి నాకు కనిపించదు’ అని చెప్పి రానా ప్రేక్షకులను షాక్‌కు గురిచేశాడు. రానాకు కుడి కన్ను కనిపించదన్న విషయాన్ని మంచు లక్ష్మి చెప్పగా.. ఎడమ కన్ను మూసివేస్తే తనకేమీ కనిపించదని, ప్రస్తుతమున్న కుడికన్ను ఎవరో చనిపోయిన తర్వాత తనకు దానం చేశారని చెప్పాడు. షోలో పాల్గొన్న ఇద్దరు చిన్నారులకు ధైర్యవచనాలు  చెప్పి.. అండగా ఉంటానని రానా హామీ ఇచ్చాడు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాతోపాటు, జాతీయ మీడియాలోనూ హల్‌చల్‌ చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement