శివగామికి మరో పవర్‌ఫుల్‌ రోల్‌! | Ramya Krishnan gets one more powerful role | Sakshi
Sakshi News home page

శివగామికి మరో పవర్‌ఫుల్‌ రోల్‌!

Nov 29 2016 3:07 PM | Updated on Sep 4 2017 9:27 PM

శివగామికి మరో పవర్‌ఫుల్‌ రోల్‌!

శివగామికి మరో పవర్‌ఫుల్‌ రోల్‌!

రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో శివగామిగా మరోసారి సత్తా చాటిన రమ్యకృష్ణకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి

రాజమౌళి ‘బాహుబలి’ సినిమాలో శివగామిగా మరోసారి సత్తా చాటిన రమ్యకృష్ణకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా సూర్య హీరోగా తెరకెక్కుతున్న తమిళ చిత్రం ‘థానా సెరంధ కూటం’లో రమ్యకృష్ణకు మరో విశిష్టమైన కీలక పాత్ర దక్కింది. దేవుడు లేడనే నాస్తికత నేపథ్యంగా తెరకెక్కుతున్న ఈ కామెడీ చిత్రం షూటింగ్‌కు సంబంధించిన పలు ఫొటోలు ఇటీవల మీడియాకు లీక్‌ అయ్యాయి.

దీనిని బట్టి ఈ సినిమా షూటింగ్‌లో రమ్యకృష్ణ  ఇప్పటికే చేరినట్టు తెలుస్తోంది.  విగ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సూర్య సరసన కీర్తిసురేశ్‌ కథానాయికగా నటిస్తోంది. ఆర్జే బాలాజీ, సెంథిల్‌, నిరోషా లాంటి తారాగణంతో కూడిన ఈ సినిమాలో రమ్యకృష్ణది కీలక పాత్ర అని వినిపిస్తోంది. బాలీవుడ్‌ సినిమా స్పెషల్‌ 26కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందుతున్నట్టు గతంలో కథనాలు రాగా, వాటిని చిత్రయూనిట్‌ కొట్టిపారేసింది. వేగంగా షూటింగ్‌ జరుపుకొంటున్న ఈ సినిమాకు అనిరుధ్‌ సంగీతం అందిస్తున్నాడు. కాగా, సూర్య ప్రతిష్టాత్మక సీక్వెల్‌ ‘సింగం-3’ రిలీజ్‌కు సిద్ధమైంది. డిసెంబర్‌ 16న ఈ సినిమా విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement