బాలయ్య సినిమాపై వర్మ రోరింగ్ కామెంట్! | Ram Gopal Varma comments on GautamiPutra Satakarni | Sakshi
Sakshi News home page

బాలయ్య సినిమాపై వర్మ రోరింగ్ కామెంట్!

Jan 12 2017 2:09 PM | Updated on Aug 29 2018 1:59 PM

బాలయ్య సినిమాపై వర్మ రోరింగ్ కామెంట్! - Sakshi

బాలయ్య సినిమాపై వర్మ రోరింగ్ కామెంట్!

'గౌతమిపుత్ర శాతకర్ణి'కి మంచి రెస్పాన్స్ వస్తుండటంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు

నందమూరి బాలకృష్ణ వందో సినిమా 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి పాజిటివ్ టాక్ వస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం విడుదలైన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుండటంతో  దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్ లో స్పందించారు. 'హే క్రిష్.. నా జడ్జిమెంట్ సరైనదేనని వినపడుతుండటం ఎంతో థ్రిల్లింగ్ కు గురిచేస్తోంది. 'గౌతమిపుత్ర శాతకర్ణి'కి రోరింగ్ టాక్ వస్తున్నందుకు నీకు అభినందనలు. నీకు, బాలయ్యకు హండ్రెడ్ ఛీర్స్' అంటూ వర్మ ట్వీట్ చేశారు.

 'శాతకర్ణి' విజయం నేపథ్యంలో ముంబైలోని నాలుగు కంపెనీలు దర్శకుడు క్రిష్ తో ఒప్పందాలు చేసుకున్నాయని, దీంతో తాను చాలా ఈర్ష్య పడుతున్నానని వర్మ అన్నారు. ఈ నాలుగు ఒప్పందాలలో ఒకటి ఏకే (ఆమిర్ ఖాన్?) నుంచి కాగా, మరొకటి ఎస్ కే (షారుఖ్ ఖాన్?) నుంచి కూడా ఉందని తెలుస్తోందని, క్రిష్ దీనిని కన్ఫర్మ్ చేస్తావా? అని వర్మ అడిగారు.
 

Advertisement
 
Advertisement
Advertisement