సూపర్ స్టార్ చిన్న కుమార్తె కోర్టుకు | Rajinikanth’s daughter Soundarya files divorce petition in family court | Sakshi
Sakshi News home page

సూపర్ స్టార్ చిన్న కుమార్తె కోర్టుకు

Dec 23 2016 3:26 PM | Updated on Sep 4 2017 11:26 PM

సూపర్ స్టార్ చిన్న కుమార్తె కోర్టుకు

సూపర్ స్టార్ చిన్న కుమార్తె కోర్టుకు

సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్న కూతురు చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. భర్త అశ్విన్‌ రామ్‌కుమార్‌తో చట్టబద్ధంగా అనుమతి ఇప్పించాలని కోరుతూ శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు.

ముంబై:సూపర్ స్టార్ రజనీకాంత్ చిన్నకుమార్తె సౌందర్య చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. భర్త అశ్విన్‌ రామ్‌కుమార్‌తో విడిపోయేందుకు చట్టబద్ధంగా  అనుమతి ఇప్పించాలని కోరుతూ శుక్రవారం పిటిషన్‌ దాఖలు చేశారు. గత కొంతకాలంగా విభేదాల కారణంగా  విడిగా ఉంటున్న  సౌందర్య, అశ్విన్ దంపతులు  చివరికి  విడిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో పరస్పర అంగీకారంతో ఇరువురు ఈ రోజు పిటిషన్ దాఖలు చేసారు.

కాగా మనస్పర్థల కారణంగా వీరిద్దరూ విడిపోతున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. దీనిపై కొన్నిరోజులకు  స్పందిచిన సౌందర్య  విడాకులు వార్తలను ధృవీకరించారు. తాము విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నామని, ఏడాదిగా దూరంగా ఉంటున్నామని ఆమె సెప్టెంబర్‌లో వెల్లడించారు. రజనీకాంత్‌ నటించిన 'కొచ్చడయాన్‌'కు డైరెక్టర్‌గా వ్యవహరించిన సౌందర్యకు..గ్రాఫిక్‌ డిజైనింగ్‌లోనూ మంచి ప్రావీణ్యం  ఉన్న సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement