జంతర్‌మంతర్‌ వద్ద ఉద్రిక్తత.. మళ్లీ రాహుల్‌! | Rahul Gandhi Detained By Police | Sakshi
Sakshi News home page

జంతర్‌మంతర్‌ వద్ద ఉద్రిక్తత.. మళ్లీ రాహుల్‌!

Nov 3 2016 7:44 PM | Updated on Sep 4 2017 7:05 PM

జంతర్‌మంతర్‌ వద్ద ఉద్రిక్తత.. మళ్లీ రాహుల్‌!

జంతర్‌మంతర్‌ వద్ద ఉద్రిక్తత.. మళ్లీ రాహుల్‌!

దేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌ వద్ద గురువారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జంతర్‌మంతర్‌ వద్ద  గురువారం రాత్రి కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీని మరోసారి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆర్మీ మాజీ జవాను ఆత్మహత్య ఘటనను నిరసిస్తూ రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్‌ శ్రేణులు జంతర్‌మంతర్‌ వద్ద ర్యాలీ తీసేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు అడ్డుకున్నారు. దీనిని ప్రతిఘటించడంతో రాహుల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
 
ఆర్మీ మాజీ జవాను రాంకిషన్‌ గ్రేవాల్‌ ఆత్మహత్య గురించి తెలియడంతో బుధవారం ఆయన నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నించిన సమయంలోనూ రాహుల్‌ని రెండుసార్లు పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా కాంగ్రెస్‌ శ్రేణులతోపాటు రాహుల్‌ను పోలీసులు అరెస్టు చేసి పార్లమెంటు స్ట్రీట్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. అనంతరం అక్కడి నుంచి పోలీసు జీపులో తుగ్లక్‌ రోడ్డు పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. రాహుల్‌ భద్రతను దృష్టిలో పెట్టుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement