చెన్నైలో దిగిన ఖతార్ ఎయిర్వేస్ విమానం | Qatar Airways flight makes emergency landing in Chennai | Sakshi
Sakshi News home page

చెన్నైలో దిగిన ఖతార్ ఎయిర్వేస్ విమానం

Sep 5 2013 6:04 PM | Updated on Oct 2 2018 7:37 PM

దోహాకు చెందిన ఖతార్ ఎయిర్వేస్ విమానమొకటి చెన్నైలో బుధవారం అర్థరాత్రి అత్యవసరంగా కిందికి దిగింది.

దోహాకు చెందిన ఖతార్ ఎయిర్వేస్ విమానమొకటి చెన్నైలో బుధవారం అర్థరాత్రి  అత్యవసరంగా కిందికి దిగింది. ఓ మహిళా ప్రయాణికురాలికి ఛాతిలో నొప్పి రావడంతో విమానాన్ని కిందకు దించారు. మలేసియాకు వెళుతున్న విమానంలో మహిళకు అత్యవసరంగా వైద్య సహాయం అవరసరం కావడంతో పైలట్ను సంప్రదించాడని చెన్నై విమానశ్రయ అధికారులు తెలిపారు.

అనుమతి లభించిన తర్వాత పైలట్ విమానాన్ని వెంటనే కిందికి దించాడని వెల్లడించారు. విమానం కిందకు దిగేటప్పటికి అంబులెన్స్, వైద్య సహాయక బృందాన్ని సిద్ధంగా ఉంచారు. ప్రాథమిక పరీక్ష తర్వాత మహిళా ప్రయాణికురాలిని ఆస్పత్రికి తరలించారు. తర్వాత విమానం ఇక్కడి నుంచి బయలుదేరిందని అధికారులు తెలిపారు.   

Advertisement
 
Advertisement
Advertisement