కాంగ్రెస్‌కు షాక్..!
ఎన్నికల వేళ పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఊహించని షాక్! పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ కూతురైన గుర్‌కన్వాల్ కౌర్ బీజేపీలో చేరిక..
న్యూఢిల్లీ: ఎన్నికల వేళ పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఊహించని షాక్! దశాబ్ధాలుగా రాష్ట్ర కాంగ్రెస్‌లో కీలక నాయకురాలిగా వ్యవహరించిన గుర్‌కన్వాల్ కౌర్ బీజేపీలో చేరారు. పంజాబ్ మాజీ సీఎం బియాంత్ సింగ్ కూతురైన గుర్‌కన్వాల్.. అమరీందర్ కేబినెట్‌లో మంత్రిగానూ పనిచేశారు. ఢిల్లీలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు అవినాశ్ రాయ్ ఖన్నా, పంజాబ్ బీజేపీ అధ్యక్షుడు విజయ్ సంప్లాల సమక్షంలో ఆమె శనివారం కాషాయతీర్థం పుచ్చుకున్నారు.
‘పంజాబ్ అభ్యున్నతి కోసం మా నాన్న రక్తం ధారపోశారు. కానీ కాంగ్రెస్‌కు మా కుటుంబం పట్లకానీ, ప్రజల పట్లకానీ ఎలాంటి సానుభూతి చూపించడంలేదు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేశా. ప్రధాని మోదీ విధానాలు నచ్చడంతో బీజేపీలో చేరా’అని గుర్‌కన్వాల్ మీడియాకు వివరించారు. కాగా, గుర్‌కన్వాల్ మునిగిపోతున్న పడవ ఎక్కారని పంజాబ్ కాంగ్రెస్ విమర్శించింది.



