ఇద్దరు మిలిటెంట్ల హతం | Protester killed in security force firing in Kashmir | Sakshi
Sakshi News home page

ఇద్దరు మిలిటెంట్ల హతం

Aug 12 2015 1:54 AM | Updated on Sep 3 2017 7:14 AM

ఇద్దరు మిలిటెంట్ల హతం

ఇద్దరు మిలిటెంట్ల హతం

భద్రతా దళాలు, లష్కరే తోయిబా మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మరణించారు.

శ్రీనగర్: భద్రతా దళాలు, లష్కరే తోయిబా మిలిటెంట్లకు మధ్య జరిగిన కాల్పుల్లో ఇద్దరు మిలిటెంట్లు మరణించారు. ఒక పోలీసు గాయపడ్డాడు. మిలిటెంట్లు చొరబడ్డారన్న సమాచారంతో సైనికులు, పోలీసులు సంయుక్తంగా సోమవారం రాత్రి దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో తనిఖీలు చేస్తుండగా ఇద్దరు మిలిటెంట్లు తారసపడడంతో ఇరు పక్షాల మధ్య కాల్పులు మొదలయ్యాయి. రాత్నిపుర, నారు గ్రామాల మధ్య వరిపొలాల్లో వీరిని మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు.

మరోవైపు.. ఈ ఎన్‌కౌంటర్‌కు నిరసనగా పుల్వామా జిల్లాలో మంగళవారం నిరసన ప్రదర్శన జరుపుతున్న ఆందోళనకారులపై భద్రతాబలగాలు జరిపిన కాల్పుల్లో 23 ఏళ్ల యువకుడు మరణించాడు. మృతుడిని పడ్గంపురా గ్రామానికి చెందిన బిలాల్ అహ్మద్ భట్‌గా గుర్తించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement