తాజ్ వద్ద ప్రిన్స్ జంట | Prince couple at the Taj | Sakshi
Sakshi News home page

తాజ్ వద్ద ప్రిన్స్ జంట

Apr 17 2016 12:53 AM | Updated on Sep 3 2017 10:04 PM

తాజ్ వద్ద ప్రిన్స్ జంట

తాజ్ వద్ద ప్రిన్స్ జంట

ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను శనివారం సాయంత్రం బ్రిటన్ ప్రిన్స్ విలియం...

న్యూఢిల్లీ: ప్రేమకు చిహ్నమైన తాజ్‌మహల్‌ను శనివారం సాయంత్రం బ్రిటన్ ప్రిన్స్ విలియం,  ఆయన సతీమణి కేట్ మిడిల్టన్ సందర్శించారు. తీవ్ర ఎండలను కూడా లెక్క చేయకుండా అక్కడే దాదాపు 45 నిమిషాల పాటు గడిపారు. ఈ సందర్భంగా సరిగ్గా 24 క్రితం ఏళ్ల క్రితం విలియమ్ తల్లి ప్రిన్సెస్ డయానా కూర్చున్న బెంచ్ మీద కూర్చుని ఫొటోలు దిగారు.


ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు వారితో ఉండి కావాల్సిన అన్ని ఏర్పాట్లను చూసుకున్నారు. తాజ్‌మహల్‌కు పక్కనే ఉన్న యమునా నదిని కూడా కాసేపు వీక్షించారు. అనంతరం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. అక్కడ నుంచి ఇంగ్లండ్ వెళ్లనున్నారు. ప్రిన్స్ జంట పర్యటన సందర్భంగా తాజ్ మహల్ వద్ద చాలామంది పర్యాటకులను నిలిపివేశారు.

Advertisement
 
Advertisement
Advertisement