కేంద్రమంత్రి కుమారి సెల్జా రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు.
కేంద్రమంత్రి సెల్జా రాజీనామాకు రాష్ట్రపతి ఆమోదం!
Jan 29 2014 9:42 PM | Updated on Sep 2 2017 3:09 AM
కేంద్రమంత్రి కుమారి సెల్జా రాజీనామాను రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదించారు. సెల్జా రాజీనామా చేయడంతో ఆ శాఖను రైల్వే మంత్రి మల్లికార్జున్ కు అప్పగించాలని ప్రధాని మన్మోహన్ సింగ్ నిర్ణయం తీసుకున్నారు. రాజ్యసభ ఎన్నికల్లో సెల్జాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే.
కుమారి సెల్జా మంత్రివర్గం నుంచి తప్పుకుని పార్టీకి సేవలందించడానికి రాజీనామా సమర్పించారు. నాలుగు సార్లు లోకసభకు ఎంపికైన సెల్జా తన స్వంత రాష్ట్రం హర్యానా నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దమయ్యారు. ఈ సంవత్సరం చివరన హర్యానాలో జరిగే ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేసేందుకు మంత్రివర్గం నుంచి తప్పుకున్నారు.
Advertisement
Advertisement