సెల్ ఫోన్ స్టోర్లుగా పోస్టాఫీసులు | Post Offices to Sell Mobile Phones in Madhya Pradesh | Sakshi
Sakshi News home page

సెల్ ఫోన్ స్టోర్లుగా పోస్టాఫీసులు

Oct 15 2015 10:01 AM | Updated on Sep 3 2017 11:01 AM

సెల్ ఫోన్ స్టోర్లుగా పోస్టాఫీసులు

సెల్ ఫోన్ స్టోర్లుగా పోస్టాఫీసులు

దేశంలో పోస్టాఫీస్ల రూపు రేఖలు మున్ముందు మారబోతున్నాయి. మొన్నటి వరకు ఉత్తర ప్రత్యుత్తరాల బట్వాడాలను, ఇటీవల నగదు బదిలీ, ఏటీఎం సెంటర్ల వంటి సర్వీసులను అందించిన పోస్టాఫీసులు ఇక్ సెల్ ఫోన్ స్టోర్లుగా కూడా కనిపించనున్నాయి.

భోపాల్: దేశంలో పోస్టాఫీస్ల రూపు రేఖలు మున్ముందు మారబోతున్నాయి. మొన్నటి వరకు ఉత్తర ప్రత్యుత్తరాల బట్వాడాలను, ఇటీవల నగదు బదిలీ, ఏటీఎం సెంటర్ల వంటి సర్వీసులను అందించిన పోస్టాఫీసులు ఇక్ సెల్ ఫోన్ స్టోర్లుగా కూడా కనిపించనున్నాయి. మధ్యప్రదేశ్లోని పోస్టాఫీసులు త్వరలో సెల్ ఫోన్ అమ్మకాల అంగడిలాగా దర్శనమివ్వబోతున్నాయి. ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగానే ఈ కొత్త తరహా విధానాన్ని ప్రారంభించినట్లు మధ్యప్రదేశ్ జీపీవో చీఫ్ పోస్ట్ మాస్టర్ మి హఖ్ తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని ప్రధాన పోస్టాఫీసు కార్యాలయాల్లో సెల్ ఫోన్లు విక్రయిస్తామని వివరించారు. ఈ మేరకు బీఎస్ఎన్ఎల్, నోయిడాకు చెందిన ఓ ప్రైవేటు కంపెనీ, పాంటెల్ టెక్నాలజీతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు చెప్పారు. పెంటా భారత్ ఫోన్ పీఎఫ్ 301 అనే ఫోన్లను బీఎస్ఎన్ఎల్ భాగస్వామ్యంతో రూ.1999కే లభిస్తుందని, 18 నెలల కాల పరిమితితో 1999 సెకన్ల ఉచిత టాక్ టైం కూడా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ తరహా కార్యక్రమాన్ని నాలుగు దక్షిణాది రాష్ట్రాల్లో పైలెట్ ప్రాజెక్టుగా అమలుచేయగా అది విజయవంతం కావడంతో తాము ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement