పీటర్ ఇంట్లో పోలీసుల సోదాలు | police searching operations at peter mukerjea home | Sakshi
Sakshi News home page

పీటర్ ఇంట్లో పోలీసుల సోదాలు

Sep 2 2015 1:56 PM | Updated on Aug 21 2018 5:51 PM

పీటర్ ఇంట్లో పోలీసుల సోదాలు - Sakshi

పీటర్ ఇంట్లో పోలీసుల సోదాలు

షీనా బోరా హత్య కేసు విషయానికి ముంబయి పోలీసులు బుధవారం టీవీ మీడియా టైకూన్, స్టార్ ఇండియా మాజీ చైర్మన్ పీటర్ ముఖర్జియా ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

ముంబయి: షీనా బోరా హత్య కేసు విషయానికి ముంబయి పోలీసులు బుధవారం టీవీ మీడియా టైకూన్, స్టార్ ఇండియా మాజీ చైర్మన్ పీటర్ ముఖర్జియా ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్నారు. 2012లో కన్నకూతురు షీనా బోరాను హత్య చేసినందుకు ప్రస్తుతం పీటర్ ముఖర్జియా భార్య ఇంద్రాణి ముఖర్జియా పోలీసుల కస్టడీలో ఉన్న విషయం తెలిసిందే.

ఈ కేసుకు సంబంధించి ఈరోజే పీటర్ వాంగ్మూలం కూడా ఇవ్వనున్న విషయం తెలిసిందే. ఈలోగానే పోలీసులు ఆయన ఇంట్లో సోదాలు చేయడం కొంత చర్చనీయాంశమైంది. కేసుకు సంబంధించి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమోనన్న ఉద్దేశంతోనే పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.  
 

Advertisement
 
Advertisement
Advertisement